NCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ప్రముఖ మినీరత్న కంపెనీ, నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు.
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 ద్వారా 1765 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: Rajiv Yuva Vikasam: నిరుద్యోగ యువతకు భారీ గుడ్ న్యూస్.. రూ.5,00,000 సాయం
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1765
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ఐటీఐ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
ఐటీఐ అప్రెంటీస్: 941 పోస్టులు
డిప్లొమా అప్రెంటీస్: 597 పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటీ: 227 పోస్టులు
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ, బీటెక్, బీఈ, ఐటీఐ పాసై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 24
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదిం ఇంకా ప్రకటించలేదు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nclcil.in/
అప్లికేషన్ లింక్: https://www.nclcil.in/
దరఖాస్తు ఫీజు: ఇంకా ప్రకటించలేదు.
వయస్సు: త్వరలో ప్రకటించనున్నారు.
పోస్టులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 1765
దరఖాస్తుకు చివరి తేది: త్వరలో ప్రకటిస్తారు
దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 24
ALSO READ: SECR Recruitment: టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతతో 835 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా మిత్రమా..?