Rajiv Yuva Vikasam: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశ పెడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సంక్షేమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీం కింద రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు సాయం చేస్తామని తెలిపారు. రూ.6వేల కోట్లతో ఈ స్కీం రూపొందించామని.. 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
ALSO READ: ICAR Recruitment: డిగ్రీ అర్హతతో ICARలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. జీతమైతే రూ.60,000
మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ స్కీం కింద దరఖాస్తులు స్వీకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు శాంక్షన్ లెటర్స్ అందజేస్తామని చెప్పారు. ఈ పథకానికి చెందిన పూర్తి విధివిధానాలను రేపు మరోసారి మీడియా సమావేశం నిర్వహించి సవివరంగా తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రూ.540 కోట్లతో వసతుల ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలోని వారసత్వ కట్టడాలను కాపాడేందుకు మొదటి విడతగా రూ.115.5 కోట్లు కేటాయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ అనంతరం చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ప్రధాన ద్వారాన్ని వినియోగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ALSO READ: POWERGRID: గుడ్ న్యూస్.. డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు.. ఈ ఉద్యోగం వస్తే భారీగా జీతం..