LIC HFL: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, స్టైఫండ్, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(LIC HFL)లో 192 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలక్ట్ అయిన వారికి నెలకు స్టైఫండ్ కూడా ఇస్తారు. సెప్టెంబర్ 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 22న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 192
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(LIC HFL)లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, సిక్కిం, ఒడిశా, పుదుచ్చెరి, వెస్ట్ బెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, హరియాణ, జమ్మూ అండ్ కశ్మీర్, బిహార్, చత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టులు – వివరాలు..
అప్రెంటిస్(ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్): 192 పోస్టులు
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. 2021 జూన్ 1 నాటికి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపో్తుంది.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 2
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 22
స్టైఫండ్: సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.12వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ట్రైనింగ్ కు స్టార్టింగ్ డేట్: 2025 నవంబర్ 1
ట్రైనింగ్ వ్యవధి: 12 నెలలు ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 192
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 22