Vijay Deverakonda-Dil Raju Rowdy Janardhan: హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో సరైన హిట్ పడి చాలా కాలం అవుతోంది. గీత గోవిందం, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత విజయ్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఈ మధ్య ఈ రౌడీ హీరో నటిస్తున్న సినిమాలన్ని వరుసగా డిజాస్టర్ బాట పడుతున్నాయి. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొడుతున్నాయి. కింగ్డమ్ మంచి కంబ్యాక్ ఇస్తానుకుంటే ఇది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో తన నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు విజయ్. అయితే ఇప్పటికే ఈ రౌడీ హీరో రెండు సినిమాలు ప్రకటించాడు.
దిల్ రాజు, విజయ్ కాంబోలో రౌడీ జనార్థన్
అందులో రౌడీ జనార్థన్ ఒకటి. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనన్న ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మించనున్నారు. గతంలో దిల్ రాజు ప్రొడక్షన్లో విజయ్ హీరోగా పరశురాం పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న ఈ సినిమా దిల్ రాజుకి నష్టాలను మిగిల్చింది. ఆ నష్టాలను తీర్చేందుకు దిల్ రాజు బ్యానర్లోనే విజయ్ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ తర్వాత ఆ వెంటనే రౌడీ జనార్థన్ మూవీ ప్రకటించారు. రాజా వారు రాణి వారు ఫేం రవి కోలా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు కథ చెప్పడంతో దిల్ రాజు ఒకే చెప్పేశాడట.
అంతా ఫిక్స్ అయిపోయింది. కింగ్డమ్ తర్వాత ఈచిత్రం పట్టాలెక్కాల్సింది. కానీ, ఇప్పుడు ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీనికి కారణంగా రౌడీ జనార్థన్ కథలో మార్పులు చేస్తున్నారట. సెకండాఫ్లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకుంటే దిల్ రాజు అంటేనే.. జడ్జిమెంట్ ఉన్న నిర్మాత. ఆయన ఒకసారి కథ ఒకే అన్నారంటే అందులో మార్పు ఉండదు. ఆయన అంచన వేసిన సినిమాలన్ని దాదాపు సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఇదంత ఒకప్పుడు. ప్రస్తుతం ఆయన అంచనాలన్ని తారుమారు అవుతున్నాయి. ఆయన బ్యానర్లో వస్తున్న సినిమాలన్ని వరుసగా డిజాస్టర్ అవుతున్నారు. ఈ మధ్య వచ్చిన చిత్రాలు భారీ నష్టాలను మిగిలిస్తున్నాయి.
రౌడీ కథలో మార్పులు
దీంతో రాజుగారు తన జడ్జిమెంట్ మరోసారి సరి చేసుకుంటున్నారట. ఇప్పటికే ఎల్లమ్మ మూవీ కథలో కొన్ని మార్పులు చేశారని తెలుస్తోంది. తాజాగా రౌడీ జనార్థన్ మూవీ కథలోనూ మార్పులు చేస్తుండటంతో రాజు గారి జడ్జిమెంట్.. తప్పిందా? అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. అయితే ప్రస్తుతం శ్రీవెంకటేశ్వర బ్యానర్ నష్టాల్లో ఉందని, కనీసం ఎంప్లాయిస్కి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అప్పుడు చేసి ఆయన ఎంప్లాయిస్కి జీతాలు ఇస్తున్నారట. అందుకే శ్రీ వెంకటేశ్వర్ బ్యానర్ లైనప్‌లో పలు చిత్రాలు ఉన్న అవి ఇంకా సెట్స్పైకి రావడం లేదు. దిల్ రాజు ప్రస్తుతం నష్టాల్లో ఉండటం వల్ల.. సినిమాలు నిర్మించే పరిస్థితుల్లో ఆయన లేరట. అందుకే ఎల్లమ్మ, రౌడీ జానార్థన్ చిత్రాలు ఆలస్యం అవుతున్నాయని ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.