BDL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను సవివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 75 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 5 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 75
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
పలు విభాగాల్లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు చూస్తే..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు: 38
డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు: 37
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 20
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 5
విద్యార్హత: బీఈ, బీటెక్, డిప్లొమా పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, డీసీసీపీ విభాగాల్లో బీఈ, బీటెక్, డిప్లొమా పాసైన వారు దరఖాస్తు చేసుకోండి.
స్టైఫండ్: అప్రెంటీప్ పోస్టుకు సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఇస్తారు. బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులకు అయితే రూ.9000 స్టైఫండ్ ఉంటుంది. డిప్లొమా అర్హత కలిగిన వారికి రూ.8000 స్టైఫండ్ ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడాలి.
అఫీషియల్ వెబ్ సైట్ : https://bdl-india.in/
కింది లింక్ క్లిక్ ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ లింక్: https://nats.education.gov.in/
అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. అప్రెంటీస్ పోస్టుకు సెలెక్ట్ అవ్వండి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 75
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 15
ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..
ALSO READ: ALP JOBS: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది..