Salman Khan : ఇటీవల కాలంలో నార్త్ హీరోలు అందరూ సౌత్ వైపు చూస్తున్నారు. కేవలం సౌత్ సినిమాలలో గెస్ట్ రోల్స్ పోషించడం మాత్రమే కాదు, ఇక్కడి డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ లిస్టులో ముందు వరుసలో ఉన్న హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఇప్పటికే ఆయన మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో ‘సికందర్’ (Sikandar) అనే సినిమా చేశారు. నెక్స్ట్ అట్లీతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ అట్లిని పక్కనపెట్టి, మరో సౌత్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడనే రూమర్ చక్కర్లు కొడుతుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…
సౌత్ డైరెక్టర్ తో మరో మూవీ
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సినిమాతో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. మార్చి 30న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు. అయితే మరోవైపు సల్మాన్ ఖాన్ ఇంకో సౌత్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడు అనే వార్త వినిపిస్తోంది.
రూమర్స్ ప్రకారం సల్మాన్ ఖాన్ త్వరలోనే ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాసామి (Rajkumar Periasamy)తో కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా రిలీజ్ అయిన ‘అమరన్’ మూవీ భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు సల్మాన్ ఖాన్ రాజ్ కుమార్ పెరియాస్ తో కొన్ని రోజుల నుంచి టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఓ భారీ ప్రాజెక్టుకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చలు జరుపుతుండగా, సల్మాన్ ఖాన్ హోం బ్యానర్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ఈ మూవీని నిర్మించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ కుమార్ కథను చెప్పగా, సల్మాన్ ఖాన్ పూర్తి స్క్రిప్ట్ చెప్పమని అడిగినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.
అట్లిని పక్కన పెట్టిన సల్మాన్ ఖాన్
ఏఆర్ మురగదాస్ తో ‘సికందర్’ మూవీ పూర్తి కాగానే సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీని అట్లీ దర్శకత్వంలో చేయబోతున్నాడని చాలాకాలంగా వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఈ మూవీ అటకెక్కిందని టాక్ నడిచింది. ఇప్పటిదాకా ఈ మూవీ ఆగిపోయింది అన్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు మేకర్స్. తాజాగా ‘సికందర్’ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఇకపై తెరకెక్కుతుందని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూవీని పూర్తి చేయాలని ప్రయత్నించినప్పటికీ ముందుకు సాగలేదని, కారణం ఏంటో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అయితే మూవీ ఆగిపోవడానికి భారీ బడ్జెట్ కారణమై ఉండొచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సల్మాన్.