HCL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్ క్లాస్ ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కు చెందిన ఖేత్రీ కాపర్ ప్రాజెక్ట్ పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రం ఝున్‌ఝును జిల్లా, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన ఖేత్రీ కాపర్ ప్రాజెక్ట్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 209
ఇందులో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 19
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2
పోస్టులు – వెకెన్సీలు:
ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు: 209
కేటగిరీ వారీగా ఉద్యోగాలు:
యూఆర్: 88 పోస్టులు
ఎస్సీ: 33 పోస్టులు
ఎస్టీ: 25 పోస్టులు
ఓబీసీ : 43 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 20 పోస్టులు
వివిధ ట్రేడ్‌ల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. మేట్ (మైన్), బ్లాస్టర్ (మైన్), ప్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సర్వేయర్, రెఫ్రిజిరేషన్ అండ్ ఏయిర్ కండీషనలర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రేడ్ ల్లో వెకెన్సీలు ఉన్నాయి.
విద్యార్హత: టెన్త్ క్లాస్, ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: 2025 మే 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఐటీఐ, టెన్త్ క్లాస్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
స్టైఫండ్: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెల చొప్పున స్టైఫండ్ అందజేస్తారు. ఆ తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.hindustancopper.com/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: CISF Recruitment: సువర్ణవకాశం.. ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం రూ.81,100
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 209
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 2