BigTV English

Shakalaka Shankar: పార్టీకి సొంత డబ్బులు ఖర్చు చేశా.. పవన్ కనీసం పట్టించుకోలే..

Shakalaka Shankar: పార్టీకి సొంత డబ్బులు ఖర్చు చేశా.. పవన్ కనీసం పట్టించుకోలే..

Shakalaka Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బయట మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో ఆర్టిస్టులుగా పనిచేసివారిలో సగానికి పైగా పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫాలోవర్స్ ఉంటారు. వారంతా పవన్ రాజకీయాల్లో వస్తున్నాడని తెలిసినప్పుడు, తను ప్రచారాల్లో పాల్గొంటున్నారని తెలిసినప్పుడు ఏ స్వార్థం లేకుండా తనకు సపోర్ట్ చేశారు. అలాంటి వారిలో షకలక శంకర్ కూడా ఒకడు. ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షో కోసం కమెడియన్‌లాగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శంకర్.. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయ్యాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్.. పవన్ కళ్యాణ్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు.


డబ్బులు ఖర్చుపెట్టేశాను

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద అభిమానంతో జనసేన పార్టీ కోసం తాను ఏమేం చేశాడో గుర్తుచేసుకున్నాడు షకలక శంకర్ (Shakalaka Shankar). ‘‘2019లో సినిమాల్లో నటించినందుకు నాకు రూ.7 లక్షలు వచ్చాయి. అవి తీసుకొని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో మావైపు ఒక తుఫాను వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బాధితులను చూడడానికి వచ్చారు. ఆయన వచ్చి వెళ్లిపోయిన వారం రోజులకు నేను కూడా అక్కడికి వెళ్లాను. రూ.3 లక్షలతో అక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేయించాను. ఆ తర్వాత మిగిలిన డబ్బును ఎన్నికల ప్రచారం కోసం ఖర్చుపెట్టేశాను. చివరికి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాను. దాంతో కోపం వచ్చి నాలుగు రోజులు నా భార్య నాతో మాట్లాడలేదు’’ అని చెప్పుకొచ్చాడు శంకర్.


ఫోన్ చేసి మాట్లాడలేదు

‘‘సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు పెట్టినందుకు మా మావయ్య కూడా చాలా మాటలు అన్నారు. చేయాలనిపించింది చేశాను అని చెప్పేశాను. మరి ఆయన కోసం అంత చేసినందుకు పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్ చేసి మాట్లాడారా అని అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. అయినా ఆయన మీద అభిమానంతో చేసినదానికి రివర్స్‌లో ఏమీ కోరుకోము. ఆయనతో సినిమా చేసినప్పుడు కూడా కనీసం ఫోటో తీసుకోలేదు. నా సోషల్ మీడియాలో ఎక్కడా పవన్ కళ్యాణ్‌తో ఫోటో ఉండదు. అభిమానం అనేది మనసులో ఉండాలి. నా మనసులో ఆయనపై ప్రేమ పర్మనెంట్‌గా ఉండిపోతుంది’’ అంటూ పవన్ కళ్యాణ్‌పై ప్రేమను బయటపెట్టాడు శంకర్.

Also Read: బన్నీ వాసుకు జనసేన కీలక బాధ్యతలు.. ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో నిర్ణయం.!

అది రాజకీయం కాదు

రాజకీయాలపై తన అభిప్రాయం ఏంటో చెప్పుకొచ్చాడు షకలక శంకర్. ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం రాజకీయం కాదని, అలా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదని అన్నాడు. ప్రజల కోసం తాము ఏం చేస్తారో చెప్పాలి కానీ అవతలి వారు ఏం చేయాలేదో చెప్తూ వారిని తిట్టుకోవడం రాజకీయం కాదని తెలిపాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌కు ఒక్క అవకాశం ఇవ్వడానికి కూడా ప్రజలు ఇష్టపడలేదని, అవకాశం ఇచ్చి నచ్చకపోతే మళ్లీ పదవిలో నుండి తీసేయాల్సిందని చెప్పాడు. 2024 ఎన్నికల సమయంలో కూడా చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు జనసేనకు సంబంధించిన ఎంతోమంది కార్యకర్తలను సపోర్ట్ చేస్తూ ప్రచారాలు చేశారు.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×