నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT)నుంచి సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్నఅభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.65,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 78
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సైంటిఫిక్ అసిస్టెంట్స్ జాబ్స్ వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 17 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 18 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ , కంప్యూటర్ అండ్ నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేటిక్స్ సబ్జెక్టులలో B.E, B.Tech, M.Sc పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
– ఈ ఉద్యోగాలను దరఖాస్తుక చేసుకునేందుకు ఎలాంటి వర్క్ ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయస్సు: 2025 మార్చి 18 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఎగ్జామ్స్ సెంటర్స్: దేశ వ్యాప్తంగా 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అగర్తల, బెంగళూరు, కాలికట్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్‌కతా, లక్నో, ముంబై, పాట్నా
అప్లికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://recruit-delhi.nielit.gov.in/
ALSO READ: Indian Army Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ.56,100 వేతనం
ముఖ్యమైనవి:
మొత్తం పోస్టుల సంఖ్య: 78
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 18