Indian Navy Recruitment: నిరుద్యోగులకు ఇది గోల్డెన్ అపార్చునిటీ. డిగ్రీలో బీకామ్, బీటెక్, బీఈ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. ఇండియన్ నేవీలో 270 ఎస్.ఎస్.సీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.
ఇండియన్ నేవిలో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 270
ALSO READ: TGPSC Group-1,2,3 Exams: ఈ ఏడాది మళ్లీ గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లు.. ఈ తప్పులు చేయకండి..
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, పైలట్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్(అబ్జర్వర్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఇంజినీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నావల్ కన్ స్ట్రక్టర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ఖాళీల వారీగా పోస్టులు..
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 60
పైలట్: 26
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 22
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 18
లాజిస్టిక్స్: 28
ఎడ్యుకేషన్ బ్రాంచ్: 38
ఎలక్ట్రికల్ బ్రాంచ్: 45
నావల్ కన్ స్ట్రక్టర్: 18
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హత ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక పాసై ఉంటే సరిపోతుంది. మరి కొన్ని ఉద్యోగాలకు బీఈ, బీటెక్, ఎంబీఏ, బీఎస్సీ, బీకామ, ఎంసీఏ, ఎమ్మెస్సీ పాసై ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉద్యోగానికి సంబంధించి 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. పైలట్ ఉద్యోగానికి 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండి.. సీపీఎల్ లైసెన్స్ కల్గి ఉండాలి. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. లాజిస్టిక్ పోస్టుకు ఫస్ట్ క్లాస్ లో బీఈ, బీటెక్, ఎంబీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంసీఏ, ఎమ్మెస్సీ పాసై ఉండాలి. ఎడ్యుకేషన్ బ్రాంచ్ పోస్టుకు 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, బీఈ, బీటెక్ పాసై ఉండాలి. ఇంజినీరింగ్ బ్రాంచ్ పోస్టుకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. ఎలక్ట్రికల్ బ్రాంచ్ పోస్టుకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. నావల్ కన్ స్ట్రక్టర్ పోస్టుకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2001 జనవరి 2 నుంచి 2006 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు 2002 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. మరికొన్ని ఉద్యోగాలకు 1999 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 8
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 25
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/
అర్హత ఉన్నఅభ్యర్థులు అందరూ వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.