OTT Movie : ఓటీటీలోకి రకరకాల జానర్ లో సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను పోటీపడి దక్కించుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా, నెలలోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇది 1980ల చివరి దశకంలో అలహాబాద్‌లో జరిగే ఒక గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరుగుతుంది. ఈ వీకెండ్ కి యాక్షన్ ప్రియులకు మంచి స్టఫ్ దొరికినట్టే. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘మాలిక్’ (Maalik) 2025లో విడుదలైన హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. పుల్కిత్ దర్శకత్వంలో, కుమార్ తౌరానీ, జయ్ శేవక్రమణి దీనిని నిర్మించారు. ఇందులో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో, ప్రోసెంజిత్ ఛటర్జీ, మానుషి ఛిల్లర్, హుమా ఖురేషీ, సౌరభ్ శుక్లా, అన్షుమాన్ పుష్కర్, రాజేంద్ర గుప్తా నటించారు. ఈ సినిమా 2025 జులై 11న థియేటర్లలో విడుదలైన IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే
1988లో అలహాబాద్‌లో ఈ కథ జరుగుతుంది. దీపక్ ఒక పేద రైతు కుటుంబానికి చెందిన యువకుడు. ఒక రోజు అతని తండ్రి భూకబ్జాదారుల దాడిలో గాయపడతాడు. ఈ సంఘటనతో దీపక్ కోపంతో రగిలిపోతాడు. ప్రతీకారం కోసం, దీపక్ ఆ దాడి చేసిన “లంగ్డా” ని హత్య చేస్తాడు. ఇది అతన్ని అండర్‌వరల్డ్‌లోకి లాగుతుంది. ఆ తరువాత స్థానిక రాజకీయ నాయకుడు శంకర్ సింగ్ ఉరఫ్ దడ్డా మద్దతుతో, దీపక్ “మాలిక్”గా మారి, నేర రాజ్యంలో శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అతని భార్య షాలిని గర్భవతిగా ఉంటుంది. అతన్ని ఈ నేర జీవితం నుండి బయటకు రమ్మని ఒప్పిస్తుంది. కానీ దీపక్ కి శత్రువుల బెడద కూడా ఉంటుంది. వారిలో MLA బల్హర్ సింగ్, సస్పెండ్ అయిన పోలీసు అధికారి ప్రభు దాస్ ప్రధానంగా ఉంటారు.
దీపక్ తన అనుచరుడైన బడౌనా సహాయంతో ఈ శత్రువులను ఎదిరిస్తాడు. మాలిక్ ను ఒక్కసారిగా శత్రువుల నుంచి దాడులు పెరుగుతాయి. ఇక ప్రభు దాస్ అనే పోలీసు అధికారికి 98 ఎన్‌కౌంటర్ల చరిత్ర ఉటుంది. మాలిక్‌ను అంతం చేయడానికి అతన్ని నియమిస్తారు. అయితే మాలిక్ తన నమ్మకమైన బడౌనాతో కలిసి హింసాత్మక ఎదురుదాడులతో సమాధానం ఇస్తాడు. షాలిని అతన్ని నేర జీవితం నుండి తప్పుకోమని వేడుకుంటుంది. కానీ మాలిక్ అహంకారం, అధికార దాహం అతన్ని ముందుకు నడిపిస్తాయి. క్లైమాక్స్‌లో ద్రోహాలు, ఎదురుదాడుల మధ్య మాలిక్ జీవితం ఒక ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? మాలిక్ కి వెన్నుపోటు ఎవరు పొడుస్తారు ? ప్రభు దాస్ పాత్ర ఇందులో ఎంత ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్స్ దగ్గరికి… నలుగురూ కలిసి బ్లైండ్ ఫోల్డ్ చేసి… ఈ అరాచకం సింగిల్స్ కి మాత్రమే