Bank of Maharashtra Notification: నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు ప్రధాన కార్యాలయం పుణెలో గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 500 జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 30 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500
కేటగిరీ వారీగా ఉద్యోగాలు..
ఎస్సీ: 75 పోస్టులు
ఎస్టీ: 37 పోస్టులు
ఓబీసీ: 135 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 50 పోస్టులు
యూఆర్: 203 పోస్టులు
పీడబ్ల్యూడీ: 20 పోస్టులు
పోస్టులు – వెకెన్సీలు:
జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ 2): 500 పోస్టులు
విద్యార్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ వారికి 55 శాతం) లేదా చార్టర్డ్ అకౌంటెంట్ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వర్క్ ఎక్స్ పీరియ్స్, కంప్యూటర్ అవగాహన, సీఏఐఐబీ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఇంపార్టెంట్ డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 13
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పది నుంచి పదిహేనళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. రూ.64,820- రూ.93,960 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఎగ్జామ్: ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (20 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (20 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(20 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్(20 మార్కులు), వ్యవధి 2 గంటలు; ఇంటర్వ్యూ (100 మార్కులు) ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.118 ఫీజు ఉంటుంది.
ALSO READ: EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్