Bihar Namo bharat Train: భారతీయ రైల్వే అందుబాటలోకి తీసుకొచ్చిన వందేభారత్, నమో భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విలాసానికి, సౌకర్యానికి పెట్టింది పేరు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లోకల్ రైళ్ల కంటే దారుణంగా వాడేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే.. వామ్మో ఇదేంట్రా బాబోయ్ అనక మానరు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
బీహార్ నమో భారత్ రైలు వీడియో నెట్టింట వైరల్
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో బీహార్ కు చెందిన నమో భారత్ రైలు. సీట్లకు సరిపడా ఎక్కాల్సిన ప్రయాణీకులు కిక్కిరిసిపోయారు. కాలు పెట్టేందుకు జాగా లేనంత మందితో నిండిపోయింది. రైలులో నిలబడటమే కాదు, డోర్ల దగ్గర వేలాడుతూ కనిపించారు.సీటు రిజర్వు చేసుకున్న ప్రయాణీకులు కూడా నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. నమో భారత్ రైలు కాస్తా లోక్ ట్రైన్ గా మారిపోయింది. లగ్జరీ రైలు అనే ఫీలింగ్ ఇప్పుడు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. లగ్జరీ జర్నీ ఇప్పుడు తోపులాటకు కేరాఫ్ గా మారిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. లోకల్ రైలు కోచ్‌లోకి ఎక్కినట్లుగా ప్రయాణీకులు నమో భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. డోర్ వద్ద చాలా వేలాడుతూ.. తోసుకుంటున్నారు. మరికొంత మంది ప్రయాణీకులు లోపలి నుంచి నెట్టుకుంటూ కిందికి దిగుతున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న నమో భారత్ వీడియో
కిక్కిరిసి పోయిన నమో భారత్ రైలుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు లక్షలాది మంది నెటిజన్లు ఈ వీడియోను చూశారు. వేలాది మంది కామెంట్స్ పెట్టారు. “రైలు పరిస్థితిని చూస్తుంటే, భారతదేశం విశ్వ గురువుగా మారబోతున్నట్లు అనిపిస్తుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. “భారత రైల్వే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఇదో నిర్శనం” అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. “ప్రజల్లో అస్సలు క్రమశిక్షణ లేకుండా పోయింది” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. “మీరు ప్రజలు క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటారు. కానీ, తగిన సంఖ్యలో రైళ్లు లేకపోవడం, పేలవమైన మౌలిక సదుపాయాలు ఈ పరిస్థితికి కారణం అయ్యాయి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “అన్ని కారణాలకు బాధ్యత వహించేది ప్రభుత్వం కాదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇంత క్రమశిక్షణ కలిగిన పౌరుడు పౌర జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న పరిస్థితి, గందరగోళం అదే” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియోపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే, మరికొంత మంది నెగెటివ్ గా స్పందిస్తున్నారు.
Read Also: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి పంబన్ బ్రిడ్జి పరిస్థితి ఇది, రైలు సేవలన్నీ బంద్!
लोगों ने नमो भारत ट्रेन को एकदम से लोकल ट्रेन ही बना दिया है। 😂 pic.twitter.com/E7wehA9yXo
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) August 12, 2025
Read Also:ఆ టైమ్‌లో టీటీఈ.. ప్రయాణీకులను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, అలా చేస్తే దబిడి దిబిడే!