Ricky ponting : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, వాష్టింగ్టన్ ఫ్రీడమ్ కోచ్ రికీ పాంటింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతను కోచ్ గా ఉన్న టీమ్ లు విజయాలు సాధించడంలో ముందుంటాయి. కానీ ఫైనల్ కి వచ్చే సరికి కాస్త తడబడుతుంటాయి. ఎందుకో ఏమో తెలియదు.. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు కి అలాగే జరిగింది. తాజాగా రికీ పాంటింగ్ కోచ్ గా ఉన్న వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకి కూడా అలాగే జరగడం విశేషం. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కి ప్రధాన కోచ్ గా పని చేసిన పాంటింగ్.. పంజాబ్ జట్టు ఫైనల్ వరకు దూసుకొచ్చింది. ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 06 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తాజాగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Also Read : R Ashwin : టీమిండియా ప్లేయర్లు భలే నాటకాలు ఆడుతున్నారు.. ఇజ్జత్ తీసిన అశ్విన్
MLC విజేతగా MI న్యూయార్క్..
మేజర్ లీగ్ క్రికెట్ 2025 విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ నిలిచింది. డల్లాస్ వేదికగా ఇవాళ జరిగిన ఫైనల్ డిఫెండింగ్ ఛాంపియన్ వాష్టింగ్టన్ ఫ్రీడమ్ ను 5 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ వాష్టింగ్టన్ ఫ్రీడమ్ ను 5 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఎమ్మెల్సీలో ఎంఐకి ఇది రెండో టైటిల్.. 2023 సీజన్ లో ఈ జట్టు తొలిసారి టైటిల్ చేజిక్కించుకుంది. ఓవరాల్ గా పొట్టి క్రికెట్ లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ఇది 13వ టైటిల్. ఈ సీజన్ లో ఎంఐ న్యూయార్క్ నికోలస్ పూరన్ నేతృత్వంలో బరిలోకి దిగింది. పూరన్ ఎంఐ ఫ్రాంచైజీల తరుపున మూడో టైటిల్ సాధించాడు. ఎంఐ ఫ్రాంచైజీలకు అత్యధిక టైటిళ్లను అందించిన ఘనత రోహిత్ శర్మకు దక్కుతుంది. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి 6 టైటిల్స్.. హర్మన్ ప్రీత్ కౌర్ 2, రషీద్ ఖాన్, హర్బజన్ సింగ్ ఎంఐ ఫ్రాంచైజీలకు తలో టైటిల్ అందించారు. ఇక ఈ సీజన్ లో పోలార్డ్ ఎంఐ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
5 పరుగుల తేడాతో..
ఇక ఈ సీజన్ లో ఎంఐ న్యూయార్క్ అనూహ్య రీతిలో ప్లే ఆప్స్ కి అర్హత సాధించి చివరికీ టైటిల్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ వియానికి వస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డికాక్ (77) మెరుపు అర్ధసెంచరీతో సత్తా చాటి ఎంఐకి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఎంఐ ఇన్నింగ్స్ లో మొనాంక్ పటేల్ 28, తజిందర్ డిల్లాన్ 14, పూరన్ 21, పొలార్డ్ 0, బ్రేస్ వేల్ 04, కన్వర్ జీత్సింగ్ 22, ట్రిస్టన్ 2, బౌల్ట్ 1 పరుగులు చేశారు. వాషింగ్టన్ బౌలర్లలో ఫెర్గూసన్ 3, నేత్రావల్కర్, మ్యాక్స్ వెల్, జాక్ ఎడ్వర్డ్స్, హోలాండ్ తలో వికెట్ తీశారు. వాషింగ్టన్ చివరి వరకు గెలుపుకోసం పోరాడింది. రచిన్ రవీంద్ర 70, ఫిలిప్స్ 48 నాటౌట్, జాక్ ఎడ్వర్డ్స్ 33, వాషింగ్టన్ ను గెలిపించేందుకు విఫలయత్నం చేసాడు. చివరి ఓవర్ లో వాషింగ్టన్ గెలుపు కోసం 12 పరుగులు అవసరం కాగా.. 22 ఏళ్ల కుర్ర పేసర్ రుషి ఉగార్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాక్స్ వెల్, గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర బ్యాటర్లను సైలెంట్ చేసి ఎంఐకి అద్భుత విజయాన్ని అందించడం విశేషం.
A touch & go year for Ricky Ponting and Shreyas Iyer so far 💔#rickyponting #shreyasiyer #ipl2025 #mlc2025 #punjabkings pic.twitter.com/e9xV0Rmsr5
— InsideSport (@InsideSportIND) July 14, 2025