YS Jagan: మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూడా ఫిర్యాదునివ్వడం విశేషం. ఇటీవల దువ్వాడ చేసిన కామెంట్స్ పై పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు. మాజీ సీఎం జగన్ పై ఫిర్యాదునివ్వడం ఇప్పుడు ఏపీలో రాజకీయ చర్చకు దారితీసింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం రోజు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమయంలో పవన్ టార్గెట్ గా దువ్వాడ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. దువ్వాడ ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదన్నారు. పవన్ నిద్రలో ఉన్నారని, ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పిన పవన్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. పవన్ అసెంబ్లీలో ఉన్నారుగా అంటూ మీడియా ప్రతినిధి చెప్పగా, లోపల ముసుగు వేసుకొని ఉన్నట్లు తాను చూశానన్నారు దువ్వాడ. అంతటితో ఆగక ప్రశ్నిస్తానన్న పవన్.. ప్రశ్నించకుండా ఉండేందుకు నెలకు రూ. 50 కోట్లు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇలా దువ్వాడ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతేకాకుండా జనసైనికులను జనసైకోలుగా దువ్వాడ అభివర్ణించారు. ఈ కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. దువ్వాడ మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే దువ్వాడ కామెంట్స్ సెగ పిఠాపురంకు తాకడంతో అక్కడి మాజీ యం.పి.పి కురుమళ్ల రాంబాబు ఫిర్యాదు చేశారు. పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో మాజీ సీఎం జగన్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ లపై ఆయన ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు వైయస్ఆర్ సీపీ శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను, జనసైనికులను జనసైకోలు అన్నందుకు దువ్వాడ శ్రీనివాస్ పై, స్త్రీల పట్ల గౌరవం, సమాజం, శాసనసభ పట్ల గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు దుర్భాషలాడే వ్యక్తులను మందలించకుండా, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఇంకా పదవులలో ఉంచి ప్రోత్సహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన రెడ్డి పై భారత శిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు రాంబాబు తెలిపారు.
Also Read: Vijayasai Reddy: సాయిరెడ్డి సైలెంట్ పాలి’ట్రిక్స్’.. న్యూటర్న్ నిజమేనా?
అయితే రాంబాబు దారిలో మరికొందరు జనసేన నాయకులు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద దువ్వాడ చేసిన కామెంట్స్ ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీగా మారాయి. మరి పోలీసులు ఫిర్యాదును స్వీకరించగా, ఏ చర్యలు తీసుకుంటారో మున్ముందు తెలిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు వైయస్ఆర్ సీపీ శాసనమండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు , మన పిఠాపురం శాసన సభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపైన మరియు రాష్ట్ర హోంశాఖామాత్యులు గౌరవ శ్రీమతి వంగలపూడి అనిత… pic.twitter.com/OjAvO1jFLn
— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 3, 2025