IOB Recruitment: నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాది పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. స్టైఫండ్ కూడా అందజేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 9 లోగా దరఖాస్తు చేసుకోగలరు.
చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా ఐఓబీ శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిపికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: TGPSC Group-2,3 Results: గ్రూప్-2,3 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. కొత్త నోటిఫికేషన్లు కూడా..?
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 750
ఇండియన్ ఓవర్సీస్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
కేటీగిరి వారీగా ఖాళీలు: యూఆర్: 368 ఉద్యోగాలు, ఎస్సీ: 111 ఉద్యోగాలు, ఎస్టీ: 34 ఉద్యోగాలు, ఓబీసీ: 171 ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్: 66 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
☀ తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీ ఉన్నాయి.
☀తెలంగాణ: 31 ఉద్యోగాలు
☀ఆంధ్రప్రదేశ్: 25 ఉద్యోగాలు
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 1
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 9
☀మార్చి 12 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.
☀ఆన్ లైన్ పరీక్ష తేది: 2025 మార్చి 16
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: 2025 మార్చి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
శిక్షణ కాలం: 1 సంవత్సరం పాటు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరీఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
స్టైఫండ్: ఉద్యోగం లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెట్రో ప్రాంతానికి అయితే నెలకు రూ.15,000; అర్బన్ ప్రాంతానికి రూ.12,000; సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000 జీతం ఉంటుంది.
ఆన్ లైన్ టెస్ట్: పరీక్షకు సంబంధించి 100 మార్కులకు ఉంటుంది. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్/ సబ్జెక్ట్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు) పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600 ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు రూ.400 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.iob.in/
అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఇస్తారు. మెట్రో ప్రాంతానికి అయితే నెలకు రూ.15,000; అర్బన్ ప్రాంతానికి రూ.12,000; సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000 జీతం ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 750
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 9
పరీక్ష తేది: 2025 మార్చి 16