BigTV English

Scary Dreams: పీడ కలలు వస్తున్నాయా ? కారణాలివే.. !

Scary Dreams: పీడ కలలు వస్తున్నాయా ? కారణాలివే.. !

Scary Dreams: రాత్రి పడుకున్నప్పుడు మనలో చాలా మందికి పీడ కలలు వస్తుంటాయి. ఈ సమస్య కొన్ని సార్లు సాధారణం కావచ్చు. కానీ పదే పదే ఇలానే భయానక కలలు వస్తున్నాయంటే ఆందోళన చెందాల్సిన విషయమే. ఎందుకంటే పీడకలలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, లైఫ్ స్టైల్ మార్పులు, అనారోగ్య కారణాలు పీడ కలలు వచ్చేలా చేస్తాయి.


నిపుణుల అభిప్రాయం ప్రకారం కలలు మన ఉప చేతన మనస్సు యొక్క ప్రతిబింబం అని చెబుతారు. మన మనస్సు ఒక రకమైన భయం, ఆందోళన లేదా ఒత్తిడికి గురైనప్పుడు అది పీడ కలల రూంలో బయటకు వస్తుంది. అసలే మనకు భయంకరమైన కలలు ఎందుకు వస్తాయి. వాటిని ఎలా ఆపవచ్చనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మానసిక ఒత్తిడి:
మీరు ఎక్కువ రోజులు ఒత్తిడితో ఉంటే లేదా ఏదైనా ఆందోళనతో బాధపడుతుంటే అది మీ నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడికి గురైన మనస్సు మరింత చురుగ్గా మారుతుంది. ఇది పీడ కలలు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వీలైనంత వరకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి.


క్రమరహిత నిద్ర యొక్క ప్రభావం:
రోజు ఒకే సమయలంలో నిద్ర లేకపోవడం వల్ల కూడా పీడకలలు వస్తాయి. ఆలస్యంగా మేల్కొని ఉండటం, సమయానికి నిద్ర రాకపోవడం లేదా అసాధారణ నిద్ర అలవాట్లు మీ కలలను ప్రభావితం చేస్తాయి.

నిద్రపోయే ముందు భయానకమైన సంఘటనలు చూడటం:
మీరు పడుకునే ముందు భయానక సినిమాలు చూస్తే లేదా ఏదైనా ప్రతికూల వార్తలు చదివితే, అది మీ మనస్సును ప్రభావితం చేస్తుంది. ఇది మెదడులో భయాన్ని కలిగిస్తుంది. ఫలితంగా భయానక కలలు వస్తాయి. అందుకే రాత్రి పడుకోవడానికి కొన్ని గంటల ముందు వరకూ ఫోన్ చూడటం మానేయడం మంచిది.

PTSD వంటి సమస్యలు:
PTSD (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) లేదా ఇతర నిద్ర సమస్యలు వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా పీడకలలకు కారణమవుతాయి. దీంతో పాటు, కొన్ని రకాల మందుల వాడకం కూడా ఈ సమస్యకు కారణమవుతుంది.

Also Read: సమ్మర్‌లో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

ఆహారం, జీవనశైలి ప్రభావం:
రాత్రిపూట ఎక్కువ కారంగా ఉండే ఆహారం తినడం వల్ల నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది. ఈ కారణం వల్ల కూడా పీడకలలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే, మద్యం , కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. ఆహారం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల పీడ కలలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.

ఈ చిట్కాలు పాటించండి:
పడుకునే ముందు ధ్యానం చేయండి. రిలాక్స్‌గా ఉండటానికి ప్రయత్నించండి.

సానుకూల ఆలోచనలను అలవర్చుకోండి. అంతే కాకుండా ప్రతికూల విషయాలను నివారించండి.

నిద్రకు సరైన సమయం కేటాయించండి. ప్రశాంతంగా నిద్రపోండి.

పీడకలలు పదే పదే వస్తుంటే, డాక్టర్‌ని సంప్రదించండి.

 

Related News

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Raksha Bandhan: తల్లి కొడుకుకి రాఖీ కట్టొచ్చా? హిందూ సాంప్రదాయం ఏం చెబుతుంది?

Curd: అమ్మ బాబోయ్.. పెరుగుతో వీటిని తింటే విషంతో సమానమా..?

Raksha Bandhan: కర్రలకు రాఖీ కట్టే ఆచారం.. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు.. కారణం ఇదేనా?

Snoring in sleep: నిద్రలో గురక… గుండెకు గండమా?

Onions: ఈ ఉల్లిపాయలు తింటే… శరీరంలో ఫంగస్ పెరుగుతుంది! జాగ్రత్త!

Big Stories

×