Mad 2 Movie Teaser Review: దాదాపు ఒకటిన్నర సంవత్సరం క్రితం ఏ అంచనాలు లేకుండా విడుదలయ్యి కేవలం మౌత్ టాక్‌తో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘మ్యాడ్’. ప్రేక్షకులకు పెద్దగా తెలియని హీరోలే అయినా కేవలం కామెడీతో, కంటెంట్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది ఈ సినిమా. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. మార్చి 29న ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ విడుదలను ఫిక్స్ చేసుకుంది. దీంతో ఇప్పటినుండే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగా తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. కానీ టీజర్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్టుందే అని చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి.
గోవాలో బ్యాచిలర్ పార్టీ
ముందుగా లడ్డు ఎంగేజ్‌మెంట్‌తో ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ మొదలవుతుంది. ‘‘ముహూర్తానికి ఇంకా మూడు రోజులు టైమ్ ఉంది. ఏం దుష్టగ్రహాలు వస్తాయో, ఏమవుతుందో’’ అంటూ ఒక డైలాగ్ రాగానే హీరోలు ఎంట్రీ ఇస్తారు. టీజర్‌లో అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ఎంటర్ అవుతారు. ఈ ముగ్గురు లడ్డు పెళ్లి కోసం వచ్చి రచ్చ మొదలుపెడతారు. గోవాలో బ్యాచిలర్ పార్టీ చేసుకోవాని డిసైడ్ అవుతారు. అక్కడ అమ్మాయిలను చూస్తూ అందరూ తెగ ఎంజాయ్ చేస్తారు. అప్పుడే అక్కడికి లడ్డు తండ్రి కూడా వస్తారు. టీజర్‌లో ఆయన కామెడీ హైలెట్‌గా నిలిచింది.
ఎంటర్‌టైన్మెంట్ తక్కువయ్యింది
‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ అంతా కామెడీగా సాగిపోతుంది అనుకున్న సమయంలోనే ముగ్గురు హీరోలు పోలీస్ యూనిఫార్మ్‌లో కనిపిస్తారు. అదే యూనిఫార్మ్‌లో అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ పోలీసులకు దొరికిపోతారు. ఆ తర్వాత తమను బెదిరించడానికి ఒక భాయ్ కాల్ చేస్తే తను ఏం చెప్తున్నాడో వినకుండా బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు సంగీత్. అలా ఈ టీజర్ ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే బ్యాచిలర్ పార్టీ కోసం గోవా వెళ్లిన హీరోలు ఏదో సమస్యలో చిక్కకుంటారని, ఆ సమస్య నుండి ఎలా తప్పించుకుంటారో కామెడీగా చూపించడమే ఈ సినిమా కథ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎంతైనా ఏ అంచనాలు లేకుండా విడుదలయ్యి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ‘మ్యాడ్’ మూవీ దీనికంటే బాగుందని అప్పుడే ఒక అంచనాకు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు.
Also Read: చిరంజీవితో ‘మజాకా’, కొడుకుగా ఆ యంగ్ హీరో.. చివరికి ప్లాన్ ఫెయిల్..!
అక్కడక్కడ మాత్రమే
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Sqaure) టీజర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ అయిన ‘హ్యాంగోవర్’తో పోలికలు ఉన్నాయని మూవీ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌లో అక్కడక్కడా డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ అయితే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. కానీ ఫస్ట్ పార్ట్ అంత ఎంటర్‌టైనింగ్‌గా మాత్రం అనిపించడం లేదని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్‌లో ఉన్న హీరోయిన్స్ ఎవరూ కూడా ఈ టీజర్‌లో కనిపించలేదు. ప్రియాంక జవాల్కర్, రెబ్బా జాన్, రమ్య పసుపులేటి వంటి ముద్దుగుమ్మలు మాత్రం అలా గెస్ట్ అప్పీయరెన్స్‌లో కనిపించి మాయమయ్యారు. మొత్తానికి ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విడుదల తర్వాత ఏ మాత్రం టాక్ సంపాదించుకుంటుందో చూడాలి.