Telugu Actress : ఇటీవల కాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, పెటాకులు అనేవి సర్వసాధారణంగా మారాయి. కానీ తాజాగా ఓ జంట పెళ్లికి ముందే ఈ ఏకంగా హనీమూన్ అంటూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసి, నెటిజన్ల ఆగ్రహానికి కారణం అయ్యింది.
వీడియోలో హనీమూన్ ?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ జంట బుల్లితెరపై బాగా పాపులర్. ఇద్దరూ సీరియల్స్ తోనే పరిచయమై, ఆ తర్వాత రియల్ లైఫ్ లో ప్రేమలో పడ్డారు. ఇక ఈ జంట సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు, వీడియోలతో హల్చల్ చేస్తూనే ఉంటుంది. పైగా ఓ సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి తమకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటోంది. అంతేకాదు ఈ సెలబ్రిటీ కపుల్ లో అమ్మాయి అయితే బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టింది. మొత్తానికి మంచి పాపులారిటీని దక్కించుకున్న వీరిద్దరూ ఇటీవల కాలంలో వరుసగా వివాదాల బారిన పడుతున్నారు.
సోషల్ మీడియాలో శృతి మించిన రొమాన్స్ తో నెటిజన్ల ట్రోలింగ్ కి రోస్ట్ అవుతున్నారు. తాజాగా ఈ జంట ఓ ఈవెంట్ సందర్భంగా వెకేషన్ కి వెళ్ళామంటూ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఇద్దరూ బెడ్ రూమ్ ని సైతం చూపిస్తూ, హనీమూన్ కు గదిని ఎలా డిజైన చేస్తారో, అలా డిజైన్ చేసి ఉన్న బెడ్ ను కూడా ప్రేక్షకులకు చూపించారు. అక్కడితో ఆగకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సందర్శించామంటూ, అక్కడ ఇద్దరూ కలిసి ట్రిప్పును ఎలా ఎంజాయ్ చేశారో వీడియో రూపంలో వివరించారు. తాజాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు “పెళ్లికి ముందే హనీమూన్ ఏంటి? సంస్కృతిని మంటగలుపుతున్నారు” అంటూ ఫైర్ అవుతున్నారు.
గతంలోనూ వివాదాలకు కొదవలేదు
ఇక ఈ జంట వివాదాల బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఓ ప్రాంక్ చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. అలాగే ఓ పాపులర్ సాంగ్ కి హీరో హీరోయిన్ల లెవెల్ లో స్టెప్పులేసి, యవ్వారం మితి మీరింది అనే కామెంట్స్ వినిపించేలా చేశారు. నిజానికి సెలబ్రిటీలు అంటే… వాళ్ళను అభిమానించే ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. అంతేగానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసి మన సంస్కృతిని చెడగొట్టే విధంగా ఉండకూడదు అన్నది నెటిజన్ల మాట. తెలుగు ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ కు వచ్చిన సెలబ్రిటీలను ఎంతగా ప్రేమిస్తారో, తేడా వచ్చింది అంటే మాత్రం అంతే ద్వేషిస్తారు. ఇక ఇలాంటి వేషాలు వేస్తే వదులుతారా? అందుకే కామెంట్స్ బాక్స్ లో సదరు జంటను ఏకిపారేస్తున్నారు.
అసలే వరుసగా డివోర్స్ తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సెలబ్రిటీ కల్చర్ పై ఓ వైపు ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాంటిది ఈ బుల్లితెర కపుల్ హద్దు మీరడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ తో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ నటి త్వరలోనే ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించబోతోంది.