Ibrahim Ali Khan: ఏ రంగంలో అయినా నెపోటిజం అనేది ఉంది. కానీ కొన్ని రంగాల్లో మాత్రమే అది బాగా ఫోకస్ అవుతుంది. ముఖ్యంగా సినీ రంగంలో నెపోటిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ భాషా ఇండస్ట్రీలో ఈ నెపోటిజం అనేది ఉన్నా.. బాలీవుడ్‌లో మాత్రమే దీనిపై ఎక్కువగా ప్రేక్షకుల ఫోకస్ ఉంటుంది. ఒక నెపో కిడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే చాలు.. వారిపై విపరీతమైన నెగిటివిటీ వచ్చేస్తుంది. వారి యాక్టింగ్ ఎలా ఉంది, వారి స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉంది అని కూడా చూడకుండా ప్రేక్షకులు వారిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కున్న ఒక స్టార్ హీరో కుమారుడు.. ఏకంగా జర్నలిస్టులను బెదిరించే వరకు వెళ్లాడు. ఫైనల్‌గా ఇన్నాళ్లకు తన తప్పును ఒప్పుకున్నాడు.
మొత్తానికి స్పందించాడు
తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan) హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నేరుగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వకుండా ముందుగా తన లక్‌ను ఓటీటీ ద్వారా పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అందుకే నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘నాదానియాన్’ అనే సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ మూవీలో ఇబ్రహీం నటన చాలా దారుణంగా ఉందంటూ చాలామంది నెటిజన్లు నెగిటివ్ రివ్యూలు అందించారు. అలాగే పాకిస్థాన్‌కు చెందిన తామూర్ ఇక్బాల్ అనే జర్నలిస్ట్ కూడా ఇబ్రహీం నటనపై దారుణమైన రివ్యూ అందించాడు. దీంతో ఇబ్రహీం అలీ ఖాన్‌కు కోపం వచ్చి ఆ జర్నలిస్ట్‌ను రోడ్డున పడేస్తానంటూ బెదిరించాడు. మొత్తానికి ఈ విషయంపై ఇన్నాళ్లు స్పందించాడు ఇబ్రహీం.
మెల్లగా నేర్చుకుంటాను
జర్నలిస్ట్‌ను బెదిరించడం తన తప్పేనంటూ ఒప్పుకున్నాడు ఇబ్రహీం అలీ ఖాన్. ‘‘నేను అసలు దానికి రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలి అన్నది నాకు కూడా కొత్తే. తామూర్ నా బాడీ గురించి మాట్లాడినప్పుడు అది చాలా నీచమైన కామెంట్ అని నాకు అనిపించింది. కానీ ముందుకు వెళ్తున్నకొద్దీ నేను మరింత సహనంగా మారుతాను. ఇప్పటికీ నేను రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అనే నేను అనుకుంటున్నాను. ఇలా మళ్లీ జరగదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇబ్రహీం ఇప్పటికైనా తను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇలా చేసిన తప్పు ఒప్పుకోవడం కూడా మంచి విషయమే అని అభిప్రాయపడుతున్నారు.
Also Read: అనుపమా ముద్దులాట.. నిజమా? సినిమా స్టంటా? ఇదిగో క్లారిటీ..
ఎన్నో ట్రోల్స్
‘నాదానియాన్’ (Nadaaniyan) సినిమాలో ఇబ్రహీం అలీ ఖాన్‌కు జోడీగా ఖుషీ కపూర్ నటించింది. ఈ ఇద్దరి యాక్టింగ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అలాగే తామూర్ ఇక్బాల్ అనే జర్నలిస్ట్ కూడా దీనిపై నెగిటివ్ రివ్యూ అందించాడు. అది ఇబ్రహీంకు నచ్చలేదు. దీంతో తన రివ్యూలకు రియాక్ట్ అయ్యాడు. ఇబ్రహీం రియాక్ట్ అయిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి అసలు తను ఏం మాట్లాడాడో అందరికీ తెలిసేలా చేశాడు తామూర్. అందులో నీతో పాటు నీ ఫ్యామిలీని రోడ్డున పడేలా చేస్తాను, ఆ పరిస్థితి చూసి నేను నవ్వుకుంటాను అని ఇబ్రహీం అలీ ఖాన్ బెదిరించినట్టుగా కనిపిస్తుంది.