BigTV English

Coolie & War2 : తెలుగు ఆడియన్స్ ను దోచుకుంటున్న కూలీ, చెన్నై కంటే హైదరాబాద్ లో హైయెస్ట్ టికెట్ రేట్లు

Coolie & War2 : తెలుగు ఆడియన్స్ ను దోచుకుంటున్న కూలీ, చెన్నై కంటే హైదరాబాద్ లో హైయెస్ట్ టికెట్ రేట్లు

Coolie & War2 : ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా సక్సెస్ అవుతుంది ఏ సినిమా అవ్వదు అనే క్లారిటీ పెద్దగా ఎవరికి ఉండదు. ఒకవేళ అదే క్లారిటీ ఉండి ఉంటే అన్ని సూపర్ హిట్ సినిమాలే వస్తాయి. అయితే ఒకప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు సినిమా చూడటానికి ఆడియన్స్ థియేటర్ కి పరుగులు పెట్టేవాళ్ళు. కానీ సినిమా ఈరోజు ఇంటికి వచ్చేస్తుంది. ఒక 30 రోజులు వెయిట్ చేస్తే చాలు ఓటీటీ లో సినిమా ప్రత్యక్షమవుతుంది.


ఇకపోతే థియేటర్ కి ఆడియన్స్ రావడం మానేశారు అని అందరికీ ఒక క్లారిటీ ఉంది. చాలాచోట్ల థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఒక పెద్ద హీరో సినిమా విడుదలయితే కానీ ఆడియన్స్ థియేటర్ కు వచ్చే పరిస్థితి లేదు. అలానే పెద్ద హీరోలు నుంచి సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉంది. ఈ తరుణంలో కొన్ని రీ రిలీజ్ సినిమాలు కొంతవరకు ప్లస్ గా మారాయి. అయితే టిక్కెట్ రేట్లు పెంచడం కూడా ఆడియన్స్ థియేటర్ కు రాకపోవడానికి ఒక కారణమని చెప్పాలి.

డబ్బింగ్ సినిమాకి హైక్.?


ఇకపోతే ప్రతిసారి కొత్త సినిమా విడుదల అవుతున్నప్పుడు ఆ సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకి కూడా టికెట్ రేట్లను పెంచుతున్నారు. ఆగస్టు 14న రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో ఆ సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్లు కూడా పెంచేశారు. తెలంగాణలో కూలీ మరియు వార్ 2 టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి.

మల్టీప్లెక్స్

రిక్లీనర్ – 530/-

నార్మల్ – 415/-

సింగిల్ స్క్రీన్స్

బాల్కనీ – 250

ఫస్ట్ క్లాస్ – 175

నార్మల్ – 100

ప్రస్తుతం దీనిపైన విపరీతమైన ట్రోలింగ్ వినిపిస్తూ ఉంది. డబ్బింగ్ సినిమాకి కూడా ఎందుకు హైక్ అని చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సినిమాను బ్యాన్ చేద్దామంటున్నారు. డబ్బింగ్ సినిమాలు ఆడియన్స్ చూడకుండా ఉండటానికి మంచి ప్లాన్ వేశారు అనేది కొంతమంది అభిప్రాయం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే చెన్నైలో కంటే హైదరాబాద్ లో కూలీ టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అలానే ముంబైలో కంటే వార్ 2 టికెట్ రేట్లు హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నాయి.

రెండింటి పైన మంచి అంచనాలు 

ఇకపోతే ఈ రెండు సినిమాలు పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే సీనియర్ హీరో కమల్ హాసన్ కు విక్రం రూపంలో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇప్పుడు రజినీకాంత్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడు అనేది చాలామందికి ఉన్న క్యూరియాసిటీ. అలానే ఎన్టీఆర్ & హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు కాబట్టి వార్ 2 పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: SSMB 29 : బాబు లుక్ అదిరింది, మహేష్ బాబు ఫ్యాన్స్ లో జోష్ నింపిన కార్తికేయ

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×