ITBP Recruitment: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు సువర్ణవకాశం. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. అసిస్టెంట్ కమాండెంట్ (టెలికమ్యూనికేషన్) లో ఖాళీగా ఉన్న 48 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభై చాలా రోజులు అవుతోంది. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 48
ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) లో అసిస్టెంట్ కమాండెంట్ (టెలీ కమ్యూనికేషన్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 19
విద్యార్హత: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి.
వయస్సు: అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 19 లోగా 30 ఏళ్ల వయస్సు మించరాదు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.400 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 56,100 నుంచి 1,77,500 జీతం లభిస్తుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.itbpolice.nic.in/
అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుకు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందరూ వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 48
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 19 (ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.)