Sreeleela: చాలావరకు హీరోయిన్లకు సౌత్‌లో కాస్త ఫేమ్ రాగానే వెంటనే నార్త్‌కు వెళ్లిపోవాలి, హిందీలో సినిమాలు చేసేయాలి అనే కోరిక మొదలవుతుంది. కొందరు హీరోయిన్లకు అయితే ప్రయత్నించకుండానే పిలిచి మరీ ఆఫర్లు ఇస్తారు బాలీవుడ్ మేకర్స్. అలా హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెట్టిన కొన్నాళ్లలోనే విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల. డెబ్యూ చేసిన కొన్నిరోజుల్లోనే స్టార్ హీరోలతో సైతం నటించి అందరినీ ఆశ్చర్యపరిచిన శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్‌లో డెబ్యూకు సిద్ధమయ్యింది. తాజాగా తన డెబ్యూ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా.. దీనిని చూస్తుంటే ‘ఆషిఖీ 2’ సినిమా గుర్తొస్తుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యంగ్ హీరోతో రొమాన్స్
2023 మొత్తం శ్రీలీల హవానే నడిచింది. తను హీరోయిన్‌గా పరిచయమయిన కొన్నిరోజుల్లోనే నెలకు ఒక మూవీలో కనిపిస్తోంది ప్రేక్షకులను అలరించింది ఈ యంగ్ బ్యూటీ. 2024 బిగినింగ్ వరకు కూడా తన హవానే కొనసాగింది. కానీ మెల్లగా తన సినిమాల్లో స్పీడ్ తగ్గింది. వెంటవెంటనే ఫ్లాపులు రావడం కూడా తన మార్కెట్‌పై ఎఫెక్ట్ చూపించింది. అదే సమయంలో ‘పుష్ప 2’లో ఐటెమ్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. ఐటెమ్ సాంగ్ వల్ల తన కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందేమో అని ఆలోచించకుండా వెంటనే ఆ ఆఫర్ ఒప్పేసుకుంది శ్రీలీల. దీంతో బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. ఇప్పుడు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన డెబ్యూకు సిద్ధమయ్యింది.
దానికి సీక్వెల్
కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒక సింగర్‌గా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ మూవీ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల (Sreeleela) ప్రేమికులుగా చాలా సంతోషంగా ఉంటారు. సింగర్‌గా కార్తిక్‌కు మంచి కెరీర్ ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గానీ, ఇతర వివరాలు గానీ ఏదీ రివీల్ చేయలేదు మేకర్స్. కానీ గ్లింప్స్ మాత్రం అదిరిపోయిందని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో లవర్స్‌గా కార్తిక్ ఆర్యన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. ఈ మూవీ వివరాలు ఏమీ తెలియకపోయినా గ్లింప్స్ చూస్తుంటే ఇది ‘ఆషిఖీ 2’కు సీక్వెల్‌లాగా ఉందని, ‘ఆషిఖీ 3’ అయ్యిండవచ్చని సందేహాలు మొదలయ్యాయి. ఈ ఏడాది దీపావళికి మూవీ విడుదల కానుందని ప్రకటించారు మేకర్స్.
Also Read: స్టార్ కిడ్స్‌కు పని దొరకదు.. యంగ్ హీరో స్టేట్‌మెంట్, పరిణామాలు తప్పవా.?
తృప్తి తప్పుకుంది
అసలైతే ‘ఆషిఖీ 3’ (Aashiqui 3) సినిమాలో కార్తిక్ ఆర్యన్‌కు జంటగా ‘యానిమల్’ ఫేమ్ తృప్తి దిమ్రీని హీరోయిన్‌గా అనుకున్నారు మేకర్స్. వీరిద్దరూ పెయిర్‌గా ఫోటో ఎడిట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటికే వీరు జంటగా ‘భూల్ భూలయ్యా 3’ మూవీ వచ్చేసింది. అందులో వీరి కెమిస్ట్రీకి అంతంత మాత్రం మార్కులే పడ్డాయి. అందుకే శ్రీలీలను ఈ సినిమాలో సెలక్ట్ చేసి ఉండవచ్చని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. ముందుగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న మూవీలో కార్తిక్, శ్రీలీల జంటగా కనిపించనున్నారని భావించారు ఆడియన్స్. కానీ ఈ గ్లింప్స్ విడుదలయిన తర్వాత కచ్చితంగా ఇది ‘ఆషిఖీ 3’ అనే ఫిక్స్ అయిపోతున్నారు.
This Diwali ❤️🔥@basuanurag @sreeleela14 #BhushanKumar @ipritamofficial #TaniBasu @ShivChanana @neerajkalyan_24 @TSeries #Diwali2025 pic.twitter.com/Ysk1U1YAJ5
— Kartik Aaryan (@TheAaryanKartik) February 15, 2025