TG Assistant Executive Engineer Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్నఅభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉండనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీం కోసం రేవంత్ సర్కార్ 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కూడా సరిపడా సిబ్బంది లేనట్టు సమాచారం. దీంతో ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీర్లకు అప్పగించనున్నట్లు తెలిసింది. మొదట 390 మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు మ్యాన్‌పవర్ సప్లయర్స్‌కు బాధ్యతను అప్పగించింది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 390
ఈ నోటిఫికేషన్ లో 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 11
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 4
విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 44 ఏళ్లు మించరాదు. కనిష్ట వయస్సు 18 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.33,800 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అఫీషియల్ వెబ్ సైట్ చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://tghousing.cgg.gov.in/
అప్లికేషన్ లింక్: https://tghousing.cgg.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇది మంచి అవకాశం. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.33,800 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 390
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 11
ఇది కూడా చదవండి: ADA Recruitment: ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో ఉద్యోగం భయ్యా.. ఈ జాబ్ మీకు వస్తే జీతం రూ.1,00,000కు పైనే..
ఇది కూడా చదవండి: NTPC Recruitment: డిగ్రీతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జీతమైతే రూ.71,000, మరి ఇంకెందుకు ఆలస్యం..!