BigTV English

Rohit Sharma: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. వరుసగా 14వ సారి టాస్‌ ఓడింది !

Rohit Sharma: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. వరుసగా 14వ సారి టాస్‌ ఓడింది !

Rohit Sharma: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా తో తలపడుతుంది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా ఓ అరుదైన రికార్డును సృష్టించింది. అదేంటి.. మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా.. అప్పుడే రికార్డు ఏంటి అనుకుంటున్నారా..? అవును.. మ్యాచ్ ప్రారంభం కాకముందే భారత్ ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడంతో ఓ ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది భారత జట్టు.


Also Read: Rivaba Jadeja on IND vs AUS: ఆసీస్ ను టీమిండియా చిత్తు చేస్తుంది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం !

అదేంటంటే ఈ మ్యాచ్ లోను భారత జట్టు టాస్ ఓడిపోయింది. దీంతో అంతర్జాతీయ వన్డేలలో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా నిలిచింది భారత్. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ తో కలిపి భారత్ వరుసగా 14వ సారి టాస్ ఓడింది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ తో సహా తాజా మ్యాచ్ వరకు ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ రికార్డుల్లో నెదర్ల్యాండ్ జట్టు 2011 – 14 మధ్య వరుసగా 11 మ్యాచ్ లలో టాస్ ఓడిపోయింది.


కాగా భారత జట్టు టాస్ ఓడిన 14 మ్యాచ్లలో రోహిత్ శర్మ 11 సార్లు టాస్ కి వెళ్లడం గమనార్హం. మరో మూడుసార్లు మాత్రమే కేఎల్ రాహుల్ టాస్ కి వెళ్ళాడు. ఈ మూడుసార్లు వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ తర్వాత భారత్ – దక్షిణాఫ్రికాకు వెళ్లి మూడు వన్డేలు ఆడింది. ఆ సిరీస్ కి కే.ఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత గత సంవత్సరం శ్రీలంకతో భారత్ 3 వన్డేలు ఆడింది. ఇంగ్లాండ్ తో ఇటీవల జరిగిన 3 వన్డేల సిరీస్ లోను ఇదే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ తో మ్యాచ్లలో భారత్ టాస్ ఓడింది.

ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా తో మ్యాచ్ లో కూడా మొదట బౌలింగ్ చేస్తుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించారు. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. టాస్ ఓడిపోయిన పరవాలేదని అంటున్నారు. ఎందుకంటే టాస్ ఓడిపోయినా.. మ్యాచులు గెలుస్తున్నాం కాబట్టి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ టాస్ ఓడిన ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆస్ట్రేలియాపై విజయాన్ని అందుకుంటుందని చెబుతున్నారు.

Also Read: Fans Offers Prayers: ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసేలా టీమిండియా ఫ్యాన్స్ పూజలు !

భారత్: 1 రోహిత్ శర్మ (కెప్టెన్), 2 శుభ్‌మన్ గిల్, 3 విరాట్ కోహ్లీ, 4 శ్రేయాస్ అయ్యర్, 5 అక్షర్ పటేల్, 6 కేఎల్ రాహుల్ (వికెట్), 7 హార్దిక్ పాండ్యా, 8 రవీంద్ర జడేజా, 9 మహ్మద్ షమీ, 10 కుల్దీప్ యాదవ్, 11 వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా: 1 కూపర్ కొన్నోలీ, 2 ట్రావిస్ హెడ్, 3 స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), 4 మార్నస్ లాబుస్చాగ్నే, 5 జోష్ ఇంగ్లిస్ (వారం), 6 అలెక్స్ కారీ, 7 గ్లెన్ మాక్స్‌వెల్, 8 బెన్ ద్వార్షుయిస్, 9 నాథన్ ఎల్లిస్, 10 ఆడమ్ జాంపా, 11 తన్‌వీర్.

Tags

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×