Group-1 Certificate Verification: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇది బిగ్ అలెర్ట్. గ్రూప్-1 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ డేట్స్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వెబ్ సైట్ లో పేర్కొన్న వెబ్ నోట్ లో పేర్కొన్నారు. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని టీజీపీఎస్సీ వివరించింది. గ్రూప్-1 పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో పరిశీలనకు రావాలని సూచించింది.
ఇది కూడా చదవండి: DIBT Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్, జీతమైతే అక్షరాల రూ.37,000.. పూర్తి వివరాలివే..
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్ లో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అదే ఏడాది అక్టోబర్ నెలలో ప్రిలిమ్స్ నిర్వహించగా.. 1:50 నిష్పత్తిలో టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇంతలో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ అవడంతో.. ఆ ఎగ్జామ్‌ను రద్దు చేశారు. ఆ తరువాత 2023 జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. అప్పుడు కూడా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాదనలు విన్న ధర్మాసనం.. పరీక్షను రద్దు చేయాలని కూడా ఆదేశించింది. దీంతో ఆ పరీక్ష కూడా క్యాన్సిల్ అయ్యింది.
ఆ తరవాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన రేవంత్ సర్కార్ 60 పోస్టులను కొత్తగా కలిపి మొత్తం 563 పోస్టులతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత ప్రిలిమ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షలు జరిగాయి. మెయిన్స్ ఎగ్జామ్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫలితాలను కూడా మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల గ్రూప్- పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను కూడా టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు.
ఈ క్రమంలోనే.. గ్రూప్-1 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ డేట్స్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని వెబ్ సైట్ లో పేర్కొన్న వెబ్ నోట్ లో పేర్కొన్నారు. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్-1 పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో పరిశీలనకు రావాలని టీజీపీఎస్సీ వివరించింది.
ఇది కూడా చదవండి: GRSE Recruitment: డిగ్రీ పాసైన వాళ్లందరూ ఈ జాబ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.. శాలరీ మాత్రం రూ.లక్షల్లో భయ్యా.. మిస్ అవ్వొద్దు..
ఇది కూడా చదవండి: RFCL Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.1,00,000 పైగా వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
మళ్లీ గ్రూప్ -1, గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే ఉద్యోగం సాధించవచ్చు. రెండు, మూడు నెలల్లో టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం. ప్రిపరేషన్ షురూ చేయండి.