Government Jobs: ఈ రోజుల్లో ఒక్క ఉద్యోగం సాధించాలంటేనే ఎంతో కష్టపడాలి. పైగా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రస్తుత రోజుల్లో ఎంత కష్టపడి చదివినా ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కొంచెం అదృష్టం ఉండాలి. ఇలాంటి పోటీ ప్రపంచంలో గోపీ కృష్ణ పది ఉద్యోగాలు సాధించడు. రాసిన ప్రతీ పరీక్షలో తన టాలెంట్ ను చూపించారు. ఆయన లక్షలాది మంది యువతకు ఆదర్శంగా నిలిచారు. పలువురు నుంచి అభినందనలు అందుకుంటున్నారు.
ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1003 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే గడువు..
భూపాలపల్లి జిల్లా గుంటూరుపల్లికి చెందిన గోపికృష్ణ పది ఉద్యోగాలు సాధించి అందరి చేత గ్రేట్ అనిపించుకుంటున్నారు. తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో అతను 70వ ర్యాంక్ సాధించారు. ఈయన ఇప్పటి వరకు 7 కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కొలువులు సాధించారు. ప్రస్తుం గోపీ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే గ్రూప్-1 పోస్టులో జాయిన అవుతానని చెప్పారు.
గోపీకృష్ణ ఎంతో మంది యువతకు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే 9 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గోపీకృష్ణ గ్రూప్-1 పోస్టుకు సెలెక్ట్ అయ్యి పదో ఉద్యోగాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అతను ప్రతి ఎగ్జామ్ ను సవాలుగా తీసుకుని చదివారు. దీంతో అన్ని సబ్జెక్టులపై విపరీతమైన పట్టు సాధించారు. మూములుగా ఒక వ్యక్తి మూడు, నాలుగు, ఐదు జాబ్ సాధించడం మనం అరుదుగా చూస్తుంటాం. ఇతను మాత్రం పది ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. ఇతను పది ఉద్యోగాలు సాధించడంతో ఫ్రెండ్స్, విలేజ్ లో పెద్దల నుంచి అభినందనలు పొందుతున్నారు.
అయితే కష్టపడి చదువుతే.. ఏదయినా సాధించవచ్చని గోపీకృష్ణ ప్రూఫ్ చేశారు. ఇప్పుడు గోపీకృష్ణను చూసి చాలా మంది నిరుద్యోగులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు.