OTT Movie : ఈమధ్య జోంబీ సినిమాలు కూడా హైలెట్ అవుతున్నాయి. ఇదివరకు హాలీవుడ్లో ఎక్కువగా ఈ సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు అన్ని భాషలలో ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో వచ్చిన జాంబిరెడ్డి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం చెప్పుకునే హాలీవుడ్ మూవీలో ఒక జోంబీల సునామీనే వస్తుంది. సముద్రం కనుచూపుమేరలో జోంబీలే ఉంటాయి. ఇవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులను హడలెత్తించే ఈ సినిమా పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో
ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పేరు ‘జోంబీ టైడల్ వేవ్’ (Zombie Tidal Wave). దీనికి ఆంథోనీ సి.ఫెర్రాంటే దర్శకత్వం వహించారు. ఇయాన్ జిరింగ్ ప్రధాన పాత్రలో నటించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే వాళ్లపై జోంబీలు దాడి చేస్తాయి. ఇవి ఒక సునామీలా విరుచుకుపడుతాయి. వీటిని అంతం చేసే క్రమంలో స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక చిన్న ద్వీపంలో చేపలు పట్టే మత్స్యకారుడైన హంటర్ షా తన పార్ట్నర్ రే మెక్‌క్రే, అతని మేనకోడలు జాడాతో కలిసి సముద్రంలో చేపలు పట్టడానికి వెళతాడు. అదే సమయంలో ఓక జోంబీ వారి పడవపై దాడి చేస్తుంది. ఈ దాడిలో జాడా ను జోంబీ గాయపరుస్తుంది. హంటర్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అదే సమయంలో డాక్టర్ కెంజీ రైట్, ఆమె కూతురు సమంత ద్వీపంలో ఉంటారు. ఇప్పుడు అక్కడ జోంబీ సమస్య తీవ్రమవుతుంది. సముద్రంలో ఒక భూకంపం సంభవించడంతో, అది జోంబీలతో నిండిన భారీ అలలను తీసుకొస్తుంది. ఈ అలలు ద్వీపంలోని తీరానికి చేరుకుని, జోంబీలను భూమిపైకి తీసుకొస్తాయి. ఆసుపత్రిలో జాడా కూడా జోంబీగా మారిపోతుంది. దీంతో రే, కెంజీ ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలో సమంత, ఆమె స్నేహితులు కూడా జోంబీల దాడికి గురవుతారు. ఈ దాడిలో ఆమె స్నేహితులు మరణిస్తారు.
హంటర్ సముద్రంలో జరిగిన సంఘటనను పరిశీలించడానికి వెళతాడు. అక్కడ వందలాది జోంబీలు నీటిలో ఈదుతూ కనిపిస్తారు. రెండవ అల వచ్చే సమయంలో, వారు ద్వీపంలోని ప్రజలను రక్షించేందుకు పోరాడతారు. ఈ ప్రక్రియలో, జోంబీలను విద్యుత్ షాక్‌తో చంపవచ్చని హంటర్ కనిపెడతాడు. అప్పుడే ఈ జోంబీ సమస్యకు కారణం ఒక బయోలాజికల్ వెపన్ అని తెలుస్తుంది. ఇది ఒక సీరం రూపంలో తయ్యారుచేయబడింది. కానీ ప్రమాదవశాత్తూ అది బయటకు వచ్చి ఇలా మనుషులు జోంబీలుగా మారుతారు. హంటర్, కెంజీ, సమంత, రే కలిసి జోంబీలను టైడ్ పూల్స్‌లోకి మళ్లించి, విద్యుత్ షాక్‌తో చంపడం మొదలు పెడతారు. సముద్ర దిగువన ఉన్న ఆయుధ పదార్థాన్ని పేల్చడం ద్వారా ఈ ముప్పును అంతం చేయాలని అనుకుంటారు. చివరికి జోంబీ లను వీళ్ళు అంతం చేస్తారా? వాటి చేతిలో బలి అవుతారా? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.