ITDC Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీ) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి గిట్ల మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ITDC) ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్(అకౌంట్స్), కౌంటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 8
ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), కౌంటర్ అసిస్టెంట్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) : 6 పోస్టులు
కౌంటర్ అసిస్టెంట్ : 2 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 30
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎస్‌ఎస్‌సీ టైర్-1లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 ఏప్రిల్ 1 నాటికి 30 ఏళ్లు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ లకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండును. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండును.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,970 నుంచి రూ.71,610 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అధికారిక వెబ్ సైట్: https://itdc.co.in
అర్హత ఉండి ఆసక్తి కలిగి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,970 నుంచి రూ.71,610 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అభ్యర్థుల్లారా..? అర్హత ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 8
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30
విద్యార్హత: డిగ్రీ పాసై ఉండాలి
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,970 నుంచి రూ.71,610 వేతనం ఉంటుంది.