Indian Railways: దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రైల్వేశాఖ ‘రైల్ కౌశల్ వికాస్ యోజన’ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు రైల్వేలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు పొందేలా చేస్తోంది. ఈ పథకం కింద అప్లై చేసుకున్న వారికి రైల్వేలోని పలు విభాగాలలో శిక్షణ అందిస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్ అందిస్తారు. దీని ద్వారా రైల్వేలో ఉద్యోగాలు పొందేలా చేస్తున్నారు.
ఏ విభాగాల్లో శిక్షణ ఇస్తారంటే?
రైల్ కౌశల్ వికాస్ యోజన పథకం కింద అప్లై చేసుకున్న వారికి రైల్వేలోని మెకానిక్, ఇన్ స్ట్రూమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ కార్పోరేట్, ఎలక్ట్రికల్ వెల్డింగ్, ఐటీఐ సంబంధిత విభాగాల్లో శిక్షణ అందిస్తారు. శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత వారికి సర్టిఫికేట్ అందిస్తారు. ఈ సర్టిఫికేట్ ను ఉపయోగించి రైల్వే ఉద్యోగాలను ఈజీగా పొందే అవకాశం ఉంటుంది.
రైల్ కౌశల్ వికాస్ యోజనకు ఎలా అప్లై చేసుకోవాలి?
దేశంలోని పౌరులంతా ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ పాస్. వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు, టెన్త్ క్లాస్ మార్కుల లిస్టు, మోబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఈమెల్ ఐడీ, పాస్ పోర్టు సైజు ఫోటో కావాలి. నేరుగా ఆన్ లైన్ ద్వారా రైల్ కౌశల్ వికాస్ యోజన అధికారిక వెబ్ సైట్ అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకునే విధానం
ముందుగా రైల్ కౌశల్ వికాస్ యోజన అధికారిక వెబ్ సైట్ (https://railkvy.indianrailways.gov.in/)ను ఓపెన్ చేయాలి. రైల్వేశాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ను పూర్తి చదివిన తర్వాత అప్లై చేసుకోవాలి. ముందుగా మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్లను స్కాన్ చేసి పెట్టుకోవాలి. అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫారమ్ లో అడిగిన వివరాలతో పాటు ఆయా సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాలి. అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాత చివరకు మరోసారి సరిచూసుకుని సబ్ మిట్ మీద క్లిక్ చేయాలి. మీ దరఖాస్తు సక్సెస్ ఫుల్ గా సబ్ మిట్ అవుతుంది. తదుపరి వివరాలను రైల్వేశాఖ మీకు మెయిల్ ద్వారా అందిస్తుంది.
Read Also: ప్లాట్ ఫారమ్ టికెట్ కౌంటర్ లోనే కాదు, ఆన్ లైన్ లోనూ తీసుకోచ్చు, ఎలాగంటే?
శిక్షణ తీసుకున్న అందరికీ ఉద్యోగాలు
రైల్ కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇప్పటి వరకు 50 వేలకు పైగా నిరుద్యోగులు ట్రైనింగ్ తీసుకున్నారు. వీరిలో దాదాపు అందరూ ప్రస్తుతం రైల్వే ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. మీకు కూడా రైల్వేలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే ముందుగా ఈ పథకం కింద అప్లై చేసుకోండి. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత కచ్చితంగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.
Read Also: రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందూ టికెట్ బుక్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇలా చేయండి!