Raashii Khanna: టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి.. హిందీలో మద్రాస్ కేఫ్ తో వెండితెరకు పరిచయమయ్యారు. తరువాత ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది. అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమా హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది. ఆ సినిమాతో ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.. వరుసగా జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం హైపర్, వంటి సినిమాలలో నటించారు. ఈమె తెలుగు తోపాటు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకుండా ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. రాశిఖన్నా తన అభిమానులతో ఎప్పుడు సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.. ఇంతకీ అందులో ఏముందో మనము చూద్దాం..
సముద్రంలో చెత్త ఎత్తి పారేస్తున్న రాశిఖన్నా..
రాశిఖన్నా సినిమాలలో నటించడంతోపాటు గాయనిగా కూడా ప్రతిభను చాటారు. 2024 లో జోరు సినిమాలో ఓ పాటను పాడి అలరించారు. ఈ అందాల భామ నటనతో పాటు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆమె హైదరాబాదులో పేదలకు ఉచిత భోజనం అందించేందుకు.. బీ ది మీరకల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆమె రోటి బ్యాంక్ ఫౌండేషన్ స్థాపించింది. ఈమె ఎన్జీవోలతో కలిసి సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తాజాగా ఈమె భంలేఫౌండేషన్ వారితో కలిసి బీచ్ దగ్గర చెత్తను శుభ్రంచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చిన్న కార్యక్రమాలతో సమాజంలో ఎంతో మార్పును తీసుకురావచ్చని, మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయండి, సమాజంలో మార్పులు తీసుకువద్దాం అంటూ ఇన్స్పైర్ చేస్తోంది ఈ చిన్నది. ప్లాస్టిక్ నిర్మూలించాలి. స్వచ్ఛతను కాపాడాలి, ఈ ఫౌండేషన్కు నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను వీరితో కలిసి ఒక చిన్న అడుగుని ముందుకు వేశాను అని రాశిఖన్నా తెలిపారు. ఈ పోస్ట్ చూసిన వారంతా రాశిఖన్నా రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను హీరోయిన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
రియల్ హీరోయిన్..
రాశిఖన్నా ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. ఓసారి ఆమె ఓ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. నేను ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు హీరోయిన్ అయ్యి ప్రజలకు సేవ చేస్తున్నాను అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆమె సోషల్ వర్క్స్ లో ఎక్కువ పాల్గొంటున్నారు. ఈమె నటించిన తెలుగు సినిమాలు సక్సెస్ ని అందుకున్నాయి. పక్కా కమర్షియల్ సినిమా తర్వాత ఈమె నుండి ఎటువంటి సినిమా రాలేదు. తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, వెంకి మామ, తీరు, పక్కా కమర్షియల్ సినిమాలలో నటించి మెప్పించారు. మరో మంచి మూవీ తో మన ముందుకు రావాలని కోరుకుందాం.

Share