AI Risk Jobs| కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఈ టెక్నాలజీ రాకతో చాలా పనులు సులభతరం అయిపోయాయి. ఏ సమాచారం కావాలన్నా.. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కోసం వెతకాలన్నా.. ఏ పని ఎలా చేయాలి? అని అనుమానం ఉన్నా.. ఈ టెక్నాలజీ సాయంతో సునాయసంగా అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఆధునికంగా వచ్చే అన్నీ ఎలెక్ట్రానిక్ పరికరాల్లో ఏఐ ఫీచర్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలాసార్లు ఏఐ టెక్నాలజీ వల్ల చాలా రంగాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫివర్ (Fiverr) కంపెనీ సీఈఓ రాసిన ఒక అధికారిక ఈమెయిల్ ఆందోళనకరంగా ఉంది. ఏఐ టెక్నాలజీతో ప్రపంచ జాబ్ మార్కెట్ లో ప్రభావితం అవుతుందని, కొన్ని కీలక రంగాల్లో ఇక ఉద్యోగుల అవసరం ఉండదని ఆ ఈ మెయిల్ లో ఫివర్ కంపెనీ సీఈఓ మిచా కౌఫ్ మ్యాన్ పేర్కొన్నారు.
ఆ ఈ మెయిల్ లో లెటర్ ని భారత కంపెనీ నీట్ ప్రాంప్ట్స్ కంపెనీ సీఈఓ ఆదిత్ సేఠ్ ఆన్ లైన్ లో షేర్ చేశారు. ఆ లెటర్ ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. ఆ లెటర్ లో మిచా కౌఫ్‌మ్యాన్ అత్యంత నిజాయితీగా కుండబద్దలు కొట్టినట్లు భవిష్యత్తు గురించి జోస్యం చెప్పారు.
సిఈఓ ఉద్యోగం కూడా సురక్షితం కాదు
ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అందుకే ఇక పనులు సులభతరంగా మారాయని.. ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయని సీఈఓ కౌఫ్‌మ్యాన్ ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పారు. కంపెనీలన్నీ ఏఐ టెక్నాలజీతో ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నాయని.. తన కంపెనీ ఫీవర్ కూడా ఈ గ్లోబల్ ట్రెండ్ ని అనుసరించక తప్పడం లేదని అన్నారు. వాణిజ్య రంగంలోని అన్ని పరిశ్రమలపై ఏఐ ప్రభావం తప్పకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. “మీరు ఏ ఉద్యోగం అయినా చేయండి.. ప్రోగ్రామర్, డిజైనర్ డేటా సైంటిస్ట్, లాయర్, లేదా కస్టమర్ సపోర్ట్.. మీ ఉద్యోగ బాధ్యతలను ఏఐ మీకంటే ఫాస్ట్ గా చేస్తుంది, మీకంటే బెటర్ గా చేస్తుంది, ఖర్చు కూడా తగ్గిస్తుంది. అంతెందుకు ఇకపై సీఈఓ ఉద్యోగానికి కూడా భద్రత లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏఐతో ప్రమాదంలో ఉన్న 8 రకాల ఉద్యోగులు
సీఈఓ కౌఫ్‌మ్యాన్ ప్రకారం.. ఏఐ తో ఈ ఉద్యోగాలు చేసేవారికి రిస్క్.
ఈ ఉద్యోగాల్లో చేసే పని రెపిటీటివ్ గా ఈజీగా ఉండడంతో ఏఐ ఆటో మేషన్ ద్వారా ఇవి మనిషి లేకుండానే పూర్తి చేయవచ్చు. కర్సర్, లెక్సిస్ + ఏఐ, ఇంటర్ కామ్ ఫిన్ లాంటి కొన్నిఏఐ టూల్స్ ఇప్పటికే పై చెప్పిన కొన్ని పనులు సమర్థవంతంగా చేయగలుగుతున్నాయి.
Also Read: మనుషులపై దాడి చేసిన రోబో.. షాకింగ్ వైరల్ వీడియో
ఉద్యోగం భద్రత కోసం ఏం చేయాలి?
ఏఐ నుంచి ఉద్యోగం పోయే ప్రమాదం ఉన్నవారికి సీఈఓ కౌఫ్ మ్యాన్ కొన్ని సలహాలు ఇచ్చారు. ఆందోళన చెందకుండా ముందు జాగ్రత్తగా ఏఐ టెక్నాలజీతో పనిచేయడం నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఏఐ రాకతో ఇక ఆ టూల్స్ నేర్చుకునేవారికే ఉద్యోగాలు ఉంటాయని ఆయన చెప్పారు.
ఉద్యోగ సంబంధిత ఏఐ టూల్స్ నేర్చుకోవాలి.
ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్కిల్స్ గురించి తెలుసుకోవాలి.
ఇన్ హౌస్ ఏఐ ఎక్స్‌పర్ట్స్ కి గుర్తించి వాటిని అలవర్చుకోవాలి.
ఉత్పత్తి పెంచేందుకు ఏఐని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.
గూగుల్ లాంటి పాత సెర్చ్ టూల్స్ పై ఆధారపడడం మానుకోవాలి.
జెనెరేటివ్ ఏఐ టెక్నాలజీ రాకవతో గూగుల్ ఇక చనిపోయినట్లే నని కౌఫ్ మ్యాన్ చెప్పారు.
నేర్చుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది.. లేకపోతే వెనబడిపోతారు
“ప్రపంచవ్యాప్తంగా చాల కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, ఇన్నోవేషన్ మధ్యలో చిక్కుకుపోయాయి. దీంతో ఫ్యూచర్ క్లియర్ గా కనిపిస్తోంది, ఏఐని కంపెనీలో తప్పక అడాప్ట్ చేసుకోవాలి. లేకపోతే డిజిటల్ ఎకానమీలో వెనకబడిపోతారు.” అని సీఈఓ కౌఫ్‌మ్యాన తీవ్రంగా హెచ్చరించారు.