Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌తో భారతదేశ కీర్తి పతాకం ప్రపంచ వీధుల్లో రెపరెపలాడుతోంది. భారత జాతి నిండు గౌరవం తలెత్తుకుని సింహంలా గర్జిస్తోంది. పాకిస్తాన్‌ను తుక్కుతుక్కు చేస్తోంది ఇండియన్ ఆర్మీ. మూడు రోజులుగా ఆపరేషన్ సిందూర్ అదరగొట్టేస్తోంది. మొదట 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చేసి.. 100 మంది ముష్కరులను మట్టుపెట్టారు. పాక్ కౌంటర్ అటాక్‌కు ట్రై చేయడంతో.. ఈసారి డైరెక్ట్‌గా పాకిస్తాన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేశారు. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, సియోల్‌కోట్.. ఇలా పెద్ద సిటీస్ అన్నీ భారత దెబ్బ చవిచూశాయి. లాహోర్ ఎయిర్‌పోర్ట్ ఫసక్. అక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్మాష్. రెచ్చిపోయిన పాకిస్తాన్ గురువారం రాత్రి భారత సరిహద్దు రాష్ట్రాలపై విరుచుకుపడింది. జమ్మూకశ్మీర్ విమానాశ్రయంపై క్షిపణులు ప్రయోగించింది. డ్రోన్లతో దాడి చేసింది. ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. కానీ…. ఒక్కటంటే ఒక్కటి కూడా భారత గడ్డను టచ్ చేయలేకపోయింది. అన్నిటికి అన్నిటినీ గాల్లోనే అడ్డుకుని పేల్చేసింది మన సుదర్శన చక్రం. అదే S 400 ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్. 3 యుద్ధవిమానాలను కోల్పోవడం దాయాదికి కోలుకోలేని దెబ్బ. ఇదంతా ఇప్పటి వరకున్న అప్‌డేట్స్.
ఆపరేషన్ సిందూర్ ట్రేడ్‌మార్క్ వివాదం
సరిహద్దుల్లో ఇంత పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ గురించి యావత్ ప్రపంచం చర్చించుకుంటోంది. ఇప్పటికే ఓ భారత జవాన్, 16 మంది పౌరులు ప్రాణాలు వదిలారు. ఇలాంటి సమయంలో శవాలపై పేలాలు వేరుకునే వారిలా.. కొన్ని బడా కంపెనీలు ‘ఆపరేషన్ సిందూర్’తో వ్యాపారం చేయాలని చూడటం సిగ్గుగా మారింది. అందులో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ కూడా ఉండటం దారుణమైన విషయం అంటున్నారు. మొత్తంగా 7 కంపెనీలు ఆపరేషన్ సిందూర్ ట్రేడ్‌మార్క్ కోసం ప్రయత్నించాయంటే డబ్బుల కోసం, బిజినెస్ కోసం వాళ్లెంతగా దిగజారి ఆలోచిస్తారో అర్థం అవుతోందంటూ అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దేశభక్తితో వ్యాపారమా?
ఆపరేషన్ సిందూర్. ఇప్పుడిది ఒక పేరు మాత్రమే కాదు. దేశ ప్రజల ఎమోషన్. 140 కోట్ల మంది భారతీయుల గుండె చప్పుడు. మన జాతి నిండు గౌరవం. పహల్గాంలో ముష్కరుల తూటాలకు అమరులై.. సిందూరం కోల్పోయిన మన ఆడ పొడుచులకు ఇచ్చే వందనం. వారికే ఈ ఆపరేషన్ సిందూర్ అంకితం. అలాంటి పేరును, దేశ ప్రతిష్టను.. వాడేసుకుని.. యాపారం చేసేసుకుని.. కోట్లు సంపాదించేద్దామనే కక్కుర్తి ప్రతిపాదనలు చేశాయి కొన్ని కంపెనీలు. ఇంకా ఆపరేషన్ సిందూర్ ముగియనే లేదు. మూడు రోజులుగా నాన్‌స్టాప్‌గా వార్ నడుస్తోంది. అంతలోకే ఆ పేరుతో ట్రేడ్‌మార్క్ లైసెన్స్ కావాలంటూ అప్లై చేశాయి కొన్ని సంస్థలు. అందులో మన మోదీకి ఇష్టమైన రిలయెన్స్ కంపెనీ కూడా ఉండటం ఆసక్తికరం. దురదృష్టకరం.
చేతులు కాలాక.. రిలయన్స్ విత్‌డ్రా..
ఆపరేషన్ సిందూర్ ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ దరఖాస్తు చేసిందనే విషయం తెలిసి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. రిలయన్స్‌ను, అంబానీని కామెంట్లతో కుళ్లబొడుస్తున్నారు. దెబ్బకు దిగొచ్చింది ఆ కంపెనీ. ఆపరేషన్ సిందూర్ ట్రేడ్‌మార్క్ కోసం పెట్టిన అప్లికేషన్‌ను విత్‌డ్రా చేసుకుంది. సంస్థకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగి అనధికారికంగా ఆ దరఖాస్తు దాఖలు చేసినట్టు తెలిపింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL). ఆ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది జియో స్టూడియోస్. ఆపరేషన్ సిందూర్‌ను ట్రేడ్‌మార్క్ చేసే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసింది.
ఇంకా ఎవరెవరంటే..
రిలయన్స్ తమ అప్లికేషన్ విత్‌డ్రా చేసుకోగా.. ఇంకా పలువురు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్ ఒకరు. ‘వినోదం, చలనచిత్ర నిర్మాణం, సాంస్కృతిక కార్యకలాపాలు, వెబ్ సిరీస్ నిర్మాణం’ కోసం ఉపయోగిస్తామని ఆయన తన దరఖాస్తులో తెలిపాడు. మరోవైపు, ఢిల్లీకి చెందిన న్యాయవాది అలోక్ కుమార్ కొఠారి.. ‘విద్య, శిక్షణ అందించడం, వినోదం, క్రీడ మరియు సాంస్కృతిక కార్యకలాపాలు’ కోసం ఆపరేషన్ సిందూర్ టైటిల్‌ను వాడుకుంటానంటూ అప్లికేషన్ ఇచ్చారు. ముంబైకి చెందిన ఆల్మైటీ మోషన్ పిక్చర్స్ నిర్మాత ప్రభ్లీన్ సంధు సైతం ‘ఆపరేషన్ సిందూర్’ వర్డ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సూరత్‌కు చెందిన యాడ్ ఫిల్మ్ మేకర్ ఉత్తమ్ జాజు కూడా ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం ట్రై చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా అన్ని దరఖాస్తులు క్లాస్ 41 ట్రేడ్‌మార్క్ కింద ఉన్నాయి. ఇది వర్డ్-టైప్ ట్రేడ్‌మార్క్‌ను ప్రత్యేకంగా ఉపయోగించే హక్కులను ఇస్తుంది.
Also Read : ఆపరేషన్ సిందూర్.. ఆ విషయంలో జాగ్రత్త అంటున్న ఐపీఎస్ సజ్జనార్