Indian Army Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 50 శాతం మార్కులతో డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇండియన్ సూపర్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ, షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకోవచ్చు. మార్చి 15న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ తేదీ లోగా ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
షార్ట సర్వీస్ కమిషన్ ద్వారా ఇండియన్ ఆర్మీఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషలు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 76 (ఇందులో ఎన్‌సీీసీ పురుష అభ్యర్థులకు 70 పోస్టులు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 6 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.)
ఈ 76 ఉద్యోగాల్లో ఎనిమిది ఉద్యోగాలు యుద్ధంలో ప్రాణాలర్పించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఇవ్వనున్నారు.
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు(అక్టోబర్ 2025) పేరులో ప్రవేశాలు కోరుతున్నారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 15
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా పాసై ఉండాలి. ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇండియన్ ఆర్మీలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్ ఇయర్ లు ఎన్ సీసీ సీనియర్ డివిజన్ వింగ్ లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికేట్ లో కనీసం బి గ్రేడ్ పొంది అయినా ఉండాలి.
-యుద్దంలో ప్రాణాలు అర్పించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సీ సర్టిపికెట్ అవసరం లేదు.
వయస్సు: 2025 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
శిక్షణ: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 49 వారాల ట్రైనింగ్ ఉంటుంది.
జీతం: ట్రైనింగ్ పీరియడ్ లో ప్రతి నెల రూ.56,100 స్టైఫండ్ కల్పిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే ఇండియన్ ఆర్మీలోని ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఇలంటి అవకాశం మళ్లీ రాదు. మార్చి 15తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మొదల నెల నుంచి మంచి వేతనం ఇవ్వనున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇండియన్ ఆర్మీలోని ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: Wipro Recruitment: గోల్డెన్ ఛాన్స్.. విప్రోలో ఉద్యోగాలు.. లక్షల జీతం
ముఖ్యమైనవి:
మొత్తం పోస్టుల సంఖ్య: 76
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15