BigTV English

AI Usage India : ఇండియాలో ఏఐ సూపర్ సక్సెస్ – టాప్ సంస్థల పెట్టుబడులు

AI Usage India : ఇండియాలో ఏఐ సూపర్ సక్సెస్ – టాప్  సంస్థల పెట్టుబడులు

AI Usage India : ఇప్పుడు ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వైపు పరుగులు పెడుతోంది. ఐటీ సంస్థల నుంచి వీధి చివరన వ్యాపారుల వరకు, పెద్దపెద్ద గణిత సమస్యలకు పరిష్కారాల నుంచి చిన్నచిన్న చిలిపి జోక్స్ వరకు అంతా.. ఏఐ సాయాన్ని పొందుతున్నారు. అయితే.. ఆశ్చర్యకరంగా అంతర్జాతీయంగా మిగతా దేశాలతో పోల్చితే.. ఏఐ వినియోగం భారత్ లో చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదికల తెలుపుతున్నాయి. ఎంతగా అంటే.. అంతర్జాతీయంగా సగటున వంద మంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగంపై ప్రాథమిక అవగాహన ఉంటే.. భారత్ లో ఏకంగా 65 శాతం మందికి ఏఐ వినియోగం గురించి అవగాహన ఉన్నట్లు తెలిపింది. ఇంటర్నేషన్ టెక్ దిగ్గజాలతో పాటు దేశీయ్ టెక్నాలజీ సంస్థలకు ఇప్పుడు ఈ విషయమే ఆశ్చర్యపరుస్తోంది. అందుకే.. అంతర్జాతీయ సంస్థలు భారత్ లో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నాయి.


వివిధ దేశాల్లోని యువత, పెద్దలు ఏఐ వినియోగంలో ఏ స్థాయిల్లో ఉన్నారో తెలుసుకునేందుకు గ్లోబల్ ఆన్ లైన్ సేఫ్టీ సర్వే సంస్థ ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో.. ఇంటర్నెట్ యూసేజ్ అధికంగా ఉన్న 15 ప్రధాన దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా.. ఈ ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. అన్ని వయసుల వారిని ఇందులో భాగస్వామ్యం కల్పించగా, అనేక అంశాలల్లో విభిన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ఇందులో.. అన్ని దేశాల నుంచి దాదాపు 15,000 మంది టీనేజర్లు, పెద్దల అభిప్రాయాలను క్రోడీకరించినట్లు వెల్లడించారు.

ఈ సర్వేలో తాము ఏఐ సాంకేతికతను తరచుగా వినియోగిస్తున్నట్లుగా తెలిపిన అంతర్జాతయ సగటు 31 శాతం, కాగా.. భారత్‌లో ఇది 65 శాతంగా తేలింది. ఈ సర్వేను 2024 జూలై 19 నుంచి ఆగష్టు 09 మధ్యలో నిర్వహించినట్లు సర్వే సంస్థ తెలపగా.. అంతకు క్రితం ఏడాది అయిన 2023తో పోల్చితే ఈ పెరుగుదల 26 శాతం అధికం అని వెల్లడించింది. అయితే.. దేశంలోని మిలీనియల్స్ అంటే 25-44 ఏళ్ల మధ్యనున్న వారు ఈ ట్రెండ్ లో ముందంటలో ఉన్నారని తేలింది. అలాగే.. మొత్తం ఇంటర్నెన్ వినియోగిస్తున్న మిలీనియల్స్ లో 84 శాతం మంది ఏఐ టెక్నాలజీని ఏదో ఓ సందర్భంలో వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.


ఏఐ ద్వారా ఎలాంటి విషయాలు తెలుసుకుంటున్నారు అనే ప్రశ్నకు.. ఇండియన్లు ఎక్కువగా అనువాదాలు చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిసింది. అలాగే.. ప్రశ్నలకు సమాధానాలు, పనిని సులువుగా చేసేందుకు సలహాలు, సూచనలు అడుగుతున్నట్లు తెలిసింది. దాంతో పాటే.. విద్యార్థులకు చదువులో సాయం చేయడానికి కూడా ఏఐ టెక్నాలజీ సాయాన్ని తీసుకుంటున్నట్లుగా తేలింది.

Also Read : ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో అసలేం జరిగింది? సాక్షుల వెర్షన్ మరోలా.. ఎందుకు?

అయితే.. ఓ వైపు మంచి చేస్తూనే, మరోవైపు ఏదైనా చెడు జరుగుతుందనే ఆందోళనలు సైతం భారతీయుల్లో ఉన్నాయని తెలుపుతోంది.. ఈ సర్వే. ఆన్‌లైన్‌లో దుర్వినియోగం, డీప్‌ఫేక్, స్కామ్‌లపై ఆందోళనపై తల్లిదండ్రుల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయని తెలిపింది. వివిధ రకాలుగా, అనేక పద్ధతుల్లో.. సైబర్ కేటుగాళ్లు అమాయకుల్ని దోచుకుంటుండగా, వారిలో మైనర్లు మాత్రమే కాదు పెద్దవాళ్లు, మధ్య వయస్కులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్నే అనేక మంది సర్వే సమయంలో వెలిబుచ్చినట్లుగా చెబుతున్నారు.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×