IIFM Recruitment: తెలుగు అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డీగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ (ఐఐఎఫ్ఎం) లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
భోపాల్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (IIFM) కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 25వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వెకెన్సీల సంఖ్య: 5
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ లో పలు రకాల వెకెన్సీలు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
టెక్నికల్ అసిస్టెంట్: 3 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్: 2 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 25
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నెలకు టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు రూ.30,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్: https://iifm.ac.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అందరూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు రూ.30,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అభ్యర్థుల్లారా..? వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు అప్లై చేయండి. జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్.
Read Also: UPSC top rankers: సివిల్స్ ఫలితాల్లో టాప్ -10 ర్యాంకర్లు వీరే..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 25
జాబ్ సెలెక్ట్ విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.