BigTV English

OTT Movie : గ్యాంగ్ వార్ లో ఇరుక్కునే సామాన్యుడు … ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ … అందరికీ ఇచ్చిపడేశాడుగా

OTT Movie : గ్యాంగ్ వార్ లో ఇరుక్కునే సామాన్యుడు … ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ … అందరికీ ఇచ్చిపడేశాడుగా

OTT Movie : గ్యాంగ్ స్టర్ పాత్రలతో వచ్చే సినిమాలు వేడి,వేడిగా ఉంటాయి. ఇటువంటి పాత్రలతో వెబ్ సిరీస్ లు కూడా ఓటిటిలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో ధనుష్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. దక్షిణ తమిళనాడులో జరిగే ఒక గ్యాంగ్ వార్ లో, ఒక సామాన్యుడు ఎదుర్కొనే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్

ఈ తమిళ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ పేరు ‘వడ చెన్నై’ (Vada Chennai). ఈ మూవీకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు.  దీనిని లైకా ప్రొడక్షన్స్ లో వండర్‌బార్ ఫిల్మ్స్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ కలసి నిర్మించాయి. ఇందులో ధనుష్, ఐశ్వర్య రాజేష్, కిషోర్, సముద్రఖని, డేనియల్ బాలాజీ, పవన్, ఆండ్రియా జెరేమియా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్టోరీ నాన్-లీనియర్ ఫార్మాట్‌లో ఉంటుంది. 1987 నుండి 2003 వరకు వివిధ టైమ్‌లైన్‌లలో జరిగే సంఘటనలను చూపిస్తుంది. ఒక సాధారణ క్యారమ్ ఆటగాడి నుండి, గ్యాంగ్‌స్టర్ లనే ఎదిరించే పాత్రలో ధనుష్ నటించారు. ఎడిటింగ్ జి. బి. వెంకటేష్, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), సోనీ లివ్ (Sony Liv) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఉత్తర చెన్నైలో రాజన్ అనే గ్యాంగ్‌స్టర్‌ను అతని అనుచరులే హత్య చేస్తారు. గుణ, సెంథిల్, వేలు, పజని, ఈ హత్య లో పాల్గొంటారు. ఈ హత్య తర్వాత, గుణ వేలును జైలుకు వెళ్లమని చెప్పి, వారిని బెయిల్‌పై తీసుకొస్తానని హామీ ఇస్తాడు సెంథిల్. అయితే బెయిల్‌పై విడిచిపెట్టనీయకుండా మోసం చేస్తాడు సెంథిల్. దీంతో వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది. రాజన్ భార్య చంద్ర తన భర్త మరణం తర్వాత గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ స్టోరీ 1987లో జరుగుతుంది. పది సంవత్సరాల తరువాత అన్బు (ధనుష్) అనే యువకుడు క్యారమ్ ఆటగాడు కనిపిస్తాడు. అతను తన పరిసరాల్లోని గ్యాంగ్‌స్టర్ జీవితం నుండి దూరంగా ఉండి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటాడు.

అయితే, ఒక చిన్న గొడవ కారణంగా అన్బు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ గుణ, సెంథిల్ గ్యాంగ్‌ల మధ్య ఉన్న శత్రుత్వంలో చిక్కుకుంటాడు. గుణ సెంథిల్‌ను చంపమని అన్బును ఒప్పిస్తాడు. కానీ అన్బు సెంథిల్ గ్యాంగ్‌తో సన్నిహితంగా మెలుగుతూ అతనికి నమ్మకంగా ఉంటాడు. అదే సమయంలో పద్మ (ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయితో అన్బు ప్రేమలో పడతాడు.ఒక సారి అన్బు అనుకోకుండా ఒక హత్య చేస్తాడు. దీనివల్ల అతను ఒక కొత్త గ్యాంగ్‌స్టర్‌ అవతారం ఎత్త వలసి వస్తుంది. అన్బు తన ప్రజల కోసం నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది.ఎందుకంటే గుణ, సెంథిల్ రాజకీయ నాయకులతో కలిసి అన్బు నివసించే ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి ప్లాన్ చేస్తారు. చివరికి అన్బు ఈ గ్యాంగ్ లకు బుద్ధి చెబుతాడా ? పద్మ తో ప్రేమ ఎంతవరకు వెళ్తుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.

Read Also : శక్తి వంతమైన రాణి … క్రూరమైన రాక్షసులు … మైండ్ బ్లాక్ అయ్యే ఫాంటసీ ఎంటర్టైనర్

Related News

OTT Movie : శబ్దం చేస్తే బతికుండగానే నమిలి మింగేసే డెత్ ఏంజెల్స్… కల్లోనూ వెంటాడే 1 గంట 30 నిమిషాల థ్రిల్లర్

OTT Movie : ఇంట్లో నుంచి పారిపోయి అబ్బాయిలతో అలాంటి పని… స్టేజ్ పైనే అంతా చేసే అమ్మాయి

OTT Movie : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : స్కూల్లోనే దుకాణం ఓపెన్.. ఇటు గర్ల్ ఫ్రెండ్, అటు టీచర్ తో… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : వెంటాడే చెట్టు శాపం… ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసే పువ్వులు… వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ మూవీ

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

Big Stories

×