OFMK Medak: తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డిగ్రీ, డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ అర్హత ఉన్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానం, ముఖ్యమైన తేదీలు, వయస్సు, పోస్టులు, వెకెన్సీలు తదితర వెకెన్సీల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK)లో కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 6న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత ఉన్నవారు ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 37
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ప్రొడక్షన్, మెకానికల్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలైటిక్స్, సివిల్, ఐటీ, టూల్ డిజైన్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, స్టోర్స్, హెచ్‌ఆర్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ మేనేజర్: 21 పోస్టులు
డిప్లొమా టెక్నీషియన్: 6 పోస్టులు
అసిస్టెంట్: 10 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా పాసై ఉంటుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు జూనియర్ మేనేజర్‌కు రూ.30,000 జీతం ఉంటుంది. డిప్లొమా టెక్నీషియన్‌కు రూ.23,000 జీతం ఉంటుది. అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.23,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 6
దరఖాస్తుకు పంపాల్సిన అడ్రస్: డిప్యూటీ జనరల్ మేనేజర్/హెచ్‌ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ-502205 అడ్రస్ కు పంపాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ALSO READ: NIACL Jobs: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.96వేల జీతం, ఇదే మంచి అవకాశం
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 37
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 6