New Gen Tata Sierra SUV: టాటా సియెర్రా ఎలక్ట్రిక్, ICE వెర్షన్లలో వినియోగదారుల ముందుకు రాబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఇండియాలో లాంచింగ్ కాబోతోంది. టాటా మోటార్స్ తయారు చేసిన ఈ ఐకానిక్ SUV 1990లో తొలిసారి మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు అదే కారు సరికొత్త రూపంలో విడుదలకాబోతోంది. ఈ కొత్త సియెర్రా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి ఇంటర్నల్ కంబస్టియన్ ఇంజన్ (ICE) కాగా, మరొకటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV).
టాటా సియెర్రా లాంచ్ తేదీ, ధర
టాటా సియెర్రా ICE వెర్షన్ 2025 చివరిలో లేదంటే 2026 ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా. EV వెర్షన్ సెప్టెంబర్ 2025 లేదంటే జనవరి 2026లో రానుంది. ఇక ధర విషయానికి వస్తే ICE వెర్షన్ ₹15 లక్షల నుంచి 25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. EV వెర్షన్ ₹25 లక్షల నుంచి ₹30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు.
టాటా సియెర్రా డిజైన్, ఫీచర్లు
టాటా సియెర్రా ఎక్స్ టీరియర్ బాక్సీ డిజైన్ తో, ఒరిజినల్ సియెర్రా సిగ్నేచర్ రియర్ వ్రాప్ అరౌండ్ గ్లాస్‌ను కలిగి ఉంటుంది. LED లైట్ బార్, వెర్టికల్ స్టాక్డ్ హెడ్ ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. రూఫ్ లైన్ ఫ్లాట్ గా, స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ తో ఉంటుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ (12.3-ఇంచ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ప్యాసెంజర్ స్క్రీన్)ను కలిగి ఉంటుంది. పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం అప్హోల్స్టరీ ఉంటుంది. 5 సీటర్ కాన్ఫిగరేషన్, కొన్ని వేరియంట్లలో 3-రో సీటింగ్ అవకాశం ఉంటుంది. సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే లెవెల్ 2 ADAS (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్). 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS తో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా ఉంటుంది. .
టాటా సియెర్రా పవర్ ట్రెయిన్
ICE వెర్షన్ 1.5-లీటర్ హైపరియన్ TGD-i టర్బో-పెట్రోల్ ఇంజన్ (168 bhp, 280 Nm)ను కలిగి ఉంటుంది. 2.0-లీటర్ క్రైటెక్ డీజిల్ ఇంజన్ (168 bhp, 350 Nm)తో వస్తుంది. ట్రాన్స్ మిషన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదంటే 6-స్పీడ్ ఆటోమేటిక్ ను కలిగి ఉంటుంది. 4×2, 4×4 ఆప్షన్లు అందుబాటులో ఉండవచ్చు. EV వెర్షన్ ను పరిశీలిస్తే హ్యారియర్ EVతో సమానమైన పవర్ ట్రెయిన్, సింగిల్ మోటర్(RWD), డ్యూయల్ మోటర్ (AWD) ఆప్షన్లను కలిగి ఉంటుంది. 500 కిమీ వరకు రేంజ్, హై-కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ తో రానుంది. టాటా Acti.EV లేదంటే Gen 2 EV ప్లాట్ ఫారమ్ పై తయారవుతుంది.
టాటా సియెర్రా కాంపిటీటర్స్
ICE వెర్షన్: హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా స్కార్పియో N, మారుతి సుజుకి గ్రాండ్ విటారా.
EV వెర్షన్: హ్యుందాయ్ క్రెటా EV, మహీంద్రా BE.05, MG ZS EV, టాటా హ్యారియర్ EV.
Read Also: గూగుల్ కు షాక్, రూ. 300 కోట్లు జరిమానా విధించిన ఆస్ట్రేలియా!