BigTV English

NIACL Jobs: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.96వేల జీతం, ఇదే మంచి అవకాశం

NIACL Jobs: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.96వేల జీతం, ఇదే మంచి అవకాశం

NIACL Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్) నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన భారీ వేతనం కూడా ఉంటుంది. డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంటెక్‌ లేదా ఎంబీఏ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్ఐఏసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 550 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 550


ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.  ఇందులో రిస్క్ ఇంజినీర్స్, ఆటో మొబైల్ ఇంజినీర్స్, లీగల్ స్పెషలిస్ట్స్, అకౌంట్స్ స్పెషలిస్ట్స్, ఐటీ స్పెషలిస్ట్, తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు: 

 రిస్క్‌ ఇంజినీర్స్‌: 50
అటోమొబైల్‌ ఇంజినీర్స్‌: 75
 లీగల్‌ స్పెషలిస్ట్స్‌: 50
 అకౌంట్స్‌ స్పెషలిస్ట్స్‌: 25
 ఏఓ(హెల్త్‌): 50
 ఐటీ స్పెషలిస్ట్స్‌: 25
 బిజినెస్‌ అనలిస్ట్స్‌: 75
 కంపెనీ సెక్రటరీ: 02
 ఆక్చ్యూరియల్‌ స్పెషలిస్ట్స్‌: 05
జనరలిస్ట్స్‌: 193

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ లేదా ఎంబీఏ, ఎంబీబీఎస్‌ లేదా బీడీఎస్‌/ఎండీఎస్‌ లేదా బీఏఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌ పాసై ఉండాలి. 55 నుంచి 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.50,925  నుంచి రూ.96,765 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు…

దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 7

దరఖాస్తుకు  చివరి తేది: ఆగస్టు 30

ఎగ్జామ్ డేట్స్: 

ప్రిలిమ్స్: 2025 సెప్టెంబర్ 14

మెయిన్స్: 2025 అక్టోబర్ 29

దరఖాస్తు ఫీజు: రూ.850 పే చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఎగ్జామ్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://newindia.co.in/

అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in/niacljul25/

అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: Biggest Gold Mines: దేశంలో బయటపడుతున్న బంగారు గనులు.. ఈ ప్రాంతాల్లో టన్నుల కొద్ది పసిడి నిక్షేపాలు..

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం వెకెన్సీల సంఖ్య: 500

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30

జీతం: నెలకు రూ.50,925  నుంచి రూ.96,765

Related News

UoH Jobs 2025: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 52 ఉద్యోగాలు.. రూ.1,82,400 వరకు జీతం

TG SET-2025: తెలంగాణ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

Canara Bank Notification: డిగ్రీతో భారీ అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేస్తే చాలు.. సెలెక్ట్ అవుతారు..!

RRB ALP Result 2025: ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

RRB JE: రైల్వేలో వేలల్లో జేఈ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే బంగారు భవిష్యత్తు మీ సొంతం, దరఖాస్తుకు ప్రారంభ తేది ఇదే

AP RDMHS: ఏపీలో టెన్త్ క్లాస్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వేతనం, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

Group-3 Selection List: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ప్రొవిజినల్ జాబితా విడుదల.. నేటి నుంచి వెబ్ ఆప్షన్స్

SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

Big Stories

×