రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు పలు చోట్ల యెల్లో కలర్స్ టైల్స్ వేసి ఉంటాయి. రోజూ మెట్రో ప్రయాణం చేస్తున్నప్పటికీ వీటిని ఎందుకు వేశారు? అనే విషయం గురించి చాలా మంది పట్టించుకోరు. ఈ యెల్లో టైల్స్ వెనుక పెద్ద కథే ఉంది. మెట్రో స్టేషన్ లో ఏ ప్లాట్ ఫారమ్ ఎక్కడ ఉందో సూచించేలా ఫుట్ ప్రింట్ తో పాటు ఆ ప్లాట్ ఫారమ్ నెంబర్ వేసి ఉంచుతారు. దాని పక్కనే యెల్లో కలర్ లో ఓ టైల్ దారి కనిపిస్తుంది. దీని మీద ప్రయాణీకులు నడిచి వెళ్తుంటారు. కానీ, ఎందుకు అలా వేశారని చాలా మంది పట్టించుకోరు. వీటిని చూడ్డానికి అందంగా ఉండటం కోసమో? జారిపడకుండా ఉండేందుకో? డిజైన్ చేయలేదు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
యెల్లో టైల్స్ లేదంటే బ్రెయిలీ టైల్స్!
మెట్రో స్టేషన్లలోని పసుపు రంగు టైల్స్ ను బ్రెయిలీ టైల్స్ లేదంటే టెక్స్చర్డ్ పాత్ అని పిలుస్తారు. వీటిని కంటి చూపు లేని వారు సురక్షితంగా మెట్రో ప్రయాణం చేసేందుకు రూపొందించారు. ఈ టైల్స్ మీద బొడిపెలు ఉంటాయి. వాటి పక్కనే నిలువు గీతలను ఉంచుతారు. కంటిచూపు లేని వాళ్లు దారిని గుర్తించేందుకు ఇవి కీలకంగా ఉపయోగపడుతాయి. తమ చేతి కర్రసాయంతో ఈ టైల్స్ దారిని ఫాలో అయ్యేందుకు సహకరిస్తాయి
అంధులకు ఉపయోగకరంగా..
మెట్రో స్టేషన్లలో యెల్లో టైల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి గుండ్రటి డాట్స్ కాగా, మరొకటి లైన్స్. యెల్లో డాట్స్ అనేవి హెచ్చరిక సంకేతాలుగా ఉపయోగపడుతాయి. ప్లాట్ ఫారమ్ చివరలు, మెట్లు, ప్రమాదకర ప్రాంతాల ముందు వేయబడుతాయి. అంధులు వీటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక లైన్స్ విషయానికి వస్తే ఇవి దారిని చూపిస్తాయి. స్టేషన్ లోపలికి, బయటకు సేఫ్ గా వెళ్లేలా డైరెక్షన్స్ ఇస్తాయి.
దివ్యాంగులకు సాయంగా..
ఇక వీల్ చైర్స్ ఉపయోగించే వారితో పాటు నడవలేని వారు ఈ టైల్స్ ద్వారా దారిని తెలుసుకుంటారు. ఈ గుర్తుల ద్వారా వాళ్లు ఎటు వెళ్తున్నారు తెలుసుకుంటారు. దివ్యాంగుల భద్రతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
యెల్లో కలర్ లోనే ఎందుకు?
పసుపు రంగు అనేది హై విజుబులిటీని కలిగి ఉంటుంది. ఈజీగా కనుక్కునేలా ఉంటుంది. దివ్యాంగులు, వృద్దులు కూడా ఈ రంగును ఈజీగా గుర్తించేలా ఉంటుంది. అందుకే ఈ రంగును ఉపయోగిస్తారు.
జపాన్ లో తొలిసారి అందుబాటులోకి..
ఈ యెల్లో కలర్ టైల్స్ ను తొలిసారి జపాన్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 1967లో వీటిని మొదట ఉపయోగించారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వినియోగించడం మొదలుపెట్టారు. మెట్రోలు, పబ్లిక్ ప్లేసెస్ లో వీటిని ఉపయోగిస్తున్నారు. సో, మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా మెట్రో స్టేషన్లలో యెల్లో కలర్ టైల్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలియకపోతే చెప్పేయండి.
Read Also: రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందూ టికెట్ బుక్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇలా చేయండి!