Ravindra Jadeja: టీమిండియా కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మరో స్టార్ ఆల్ రౌండర్ టీమ్ ఇండియాకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్… రిటర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అతని బాటలోనే మరో ఆల్రౌండర్ నడిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడట. అతని ఎవరో కాదు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja).
Also Read: Virat Kohli: ఆధ్యాత్మిక ప్రాంతానికి కోహ్లీ ఫ్యామిలీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసమేనా..?
రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ క్రిటిక్ పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ కూడా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా… పెట్టడం గమనార్హం. తన సోషల్ మీడియాలో ఎనిమిదవ నెంబర్ టెస్ట్ జెర్సీ ఫోటోను షేర్ చేసి…. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja )… అందరికీ షాక్ ఇచ్చాడు.
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ పోస్ట్ పెట్టడంతో అందరూ అతడు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు చర్చించుకుంటున్నారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ తో పాటు టి20 లకు రిటైర్మెంట్ ఇచ్చాడు రవీంద్ర జడేజా. ఇక ఇప్పుడు టెస్ట్ క్రికెట్కు కూడా త్వరలోనే గుడ్ బాయ్ చెప్పేందుకు… రంగం సిద్ధం చేసుకున్నాడట ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ). ఈ విషయంపై త్వరలోనే ప్రకటన రాబోతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: R Ashwin: హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు… అధికారిక భాష మాత్రమే
గత కొన్ని రోజులుగా టెస్ట్ ఫార్మేట్ లో రవీంద్ర జడేజా దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో అతనికి టెస్ట్ జట్టులో… తక్కువగానే అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే రవీంద్ర జడేజా రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ పోస్టు స్పష్టం చేస్తోంది. ఈ నెలాఖరులో ఈ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వన్డేలలో ఆడేందుకు జడేజా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అటు వన్డే ఫార్మాట్ లో కూడా రవీంద్ర జడేజా కు అవకాశాలు రావడం కష్టమేనని అంటున్నారు. టెస్ట్ కాకుండా మొత్తం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి కేవలం… సీఎస్కేకు ఆడుకోవాలని కొంతమంది కామెంట్ చేయడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా… ఇప్పటివరకు 8 టెస్టులు ఆడాడు రవీంద్ర జడేజా. ఇందులో 3370 పరుగులు చేశాడు. అలాగే 323 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు రవీంద్ర జడేజా. గత కొన్ని రోజులుగా… రవీంద్ర జడేజా అలాగే, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ… జంటగా టీమిండియా కు ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్, అలాగే కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్లు తెరపైకి రావడంతో… అశ్విన్ అలాగే రవీంద్ర జడేజాలకు పెద్దగా ఛాన్సులు రావడం లేదు. దీంతో మొదటగా అశ్విన్… రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు టెస్టులకు రవీంద్ర జడేజా కూడా దూరం అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో రవీంద్ర జడేజా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Shocking : #RavindraJadeja to retire from Test Format #AUSvsIND pic.twitter.com/VDxHoh6l9y
— 𝕄𝕣_𝕊 (@TweetsFromMr_S) January 10, 2025