నిరుద్యోగ అభ్యర్థులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న ఆఫీసర్స్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నగదు నిర్వహణ అత్యున్నత సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఉద్యోగాల ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు. వీటిలో ఆఫీసర్స్ గ్రేడ్-బి (డీఆర్)-జనరల్ కేటగిరీలో 40 పోస్టులు ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ విభాగంలో 10 పోస్టులను భర్తీ చేస్తారు. స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగంలో మరో 10 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు తమ ఆసక్తి ఉన్న విభాగాన్ని బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60
విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అకడమిక్ కెరీర్‌లో కనీసం 65 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి.
వయస్సు: వయోపరిమితి విషయానికొస్తే 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోసడలింపు లభిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్ల వరకు రాయితీ ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో కొనసాగుతుంది. ఫేజ్-1 రాత పరీక్ష ఫేజ్-2 రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు.
ఎగ్జామ్ డేట్స్: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 13న ఫేజ్-1 పరీక్ష జరుగుతుంది. డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల వారికి జూన్ 14న తొలి దశ పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలు జూలై 25, 26 తేదీల్లో నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
జీతం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుతాయి. నెలకు రూ.78,450 నుంచి రూ.1,41,900 వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ప్లస్ జీఎస్‌టీ ఫీజుగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు: అభ్యర్థులు ఏప్రిల్ 29 నుంచి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుకు మే 20 చివరి తేదీగా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://opportunities.rbi.org.in/
ALSO READ: రిటైర్డ్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రూ.వెయ్యి కోట్ల బకాయిలు విడుదల