Territorial Army Recruitment: ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. టెరిటోరియల్ ఆర్మీ (ప్రాదేశిక సైన్యం)లో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పరీక్షా నోటిఫికేషన్ ఆన్ లైన్ లో మే 12న విడుదల కానుండగా.. ఈ ఉద్యోగం కోసం భారత పౌరులు దరఖాస్తులు చేసుకోవాలని ఇండియన్ ఆర్మీ కోరింది. ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించేవారు అఫీషియల్ వెబ్ సైట్ అయిన https://territorialarmy.in నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలని.. ఇందులో అర్హతలకు సంబంధించి అన్ని వివరాలు పొందుపరిచి ఉంటాయని తెలిపింది.
డిగ్రీ విద్యార్హత కలిగిన 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వయసు లోపు పరుషులు, మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు శారీరకంగా, మెడికల్ గా ఫిట్ నెస్ కలిగి ఉండాలని భారత సైన్యం సూచించింది. మే 12 నుంచి జూన్ 10 వరకు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
Also Read: సచిన్, ధోని.. యుద్ధ రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ..
నోటిషికేషన్ లో ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు, పరీక్షా తేదీలు, అప్లికేషన్ ఫీజు, వయసు అర్హత, విద్యార్హత, ఖాళీల సంఖ్, జీవభత్యాల వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుంది.
ప్రస్తుతం అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మే 2025లోనే విడుదల చేస్తారు. “టెరిటోరియర్ ఆర్మీ ఆఫీసర్ ఫర్ సివిలియన్ క్యాండిడేట్స్ కు ఎంట్రెన్స్ పరీక్ష నోటిఫికేషన్ మే నెలలోనే ప్రచురించబడుతుంది” అని వెబ్ సైట్ లో ఉంది.