BigTV English
Advertisement

Samantha’s post: సోషల్ మీడియాలో సమంత మరో పోస్ట్..శభాష్ అంటున్న ఫ్యాన్స్..!

Samantha’s post: సోషల్ మీడియాలో సమంత మరో పోస్ట్..శభాష్ అంటున్న ఫ్యాన్స్..!

 Samantha’s post: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను దోచుకున్న సమంత (Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య(Naga Chaitanya) తో ప్రేమలో పడిన ఈమె దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే అలా వివాహం చేసుకున్న తర్వాత నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా , ఆదర్శంగా గడిపిన ఈ జంట అనూహ్యంగా మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా కెరియర్ కొనసాగిస్తూ ఉండగా.. మరొకవైపు నాగచైతన్య శోభిత ధూళిపాల (Shobhita dhulipala) తో గత ఏడాది డిసెంబర్లో రెండవ వివాహం చేసుకున్నారు.


ఒంటరి పోరాటమే..

ఇకపోతే సమంత విడాకుల తర్వాత ‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపైనే ఫోకస్ పెట్టింది. ఈ మధ్యనే మళ్ళీ నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె.. ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది. ఇటు ఈమె ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. అందులో భాగంగానే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఈమె, ఈ సంస్థ ద్వారా ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఇప్పుడు తన ఫోటోలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక విషయాన్ని పంచుకుంది.


ALSO READ ; Vijay Thalapathi: షూటింగ్ సెట్ లో ఆయనపై గన్ గురిపెట్టిన విజయ్.. వీడియో వైరల్..!

అద్భుతమైన కొటేషన్ షేర్ చేసిన సమంత..

అందులో..” ఏ నది కూడా తమ దాహం తీర్చుకోవడం కోసం వాటి నీటిని అవే తాగవు. అలాగే చెట్లు కూడా తమకు కాసేపళ్ళను అవి తినలేవు. సూర్యుడు కూడా అంతే.. తనకోసం కాంతిని ప్రకాశింపడు .. పువ్వులు కూడా తమ పరిమళాన్ని తమ కోసమే ఉపయోగించవు కదా.. అలాగే మనం కూడా పుట్టింది ఇతరులకు హెల్ప్ చేయడం కోసమే.. సమాజం మనం ఎంత హ్యాపీగా ఉన్నామనేది చూడదు. కానీ నీవల్ల ఇతరులు ఎంత సహాయ పొందారు అనేది మాత్రమే చూస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు” అంటూ పోప్ ప్రాన్సిక్ చెప్పిన డైలాగ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సమంతతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించగలిగితే.. ఇన్ని దాడులు జరగవు.. ఇంతమంది తమ ప్రాణాలను కోల్పోవాల్సిన అవసరం ఉండదు అంటూ అందరూ తమ వంతు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత షేర్ చేసిన ఈ ఇన్ స్టా స్టోరీ మాత్రం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×