SECR Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, 2025-26 సంవత్సరానికి నాగ్‌పుర్ డివిజన్, మోతిబాగ్ వర్క్‌షాప్(నాగ్‌పుర్)లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 1007
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వివిధ ట్రేడుల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ తదితర ట్రేడుల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
ఫిట్టర్: 66 పోస్టులు
కార్పెంటర్: 39 పోస్టులు
వెల్డర్: 17 పోస్టులు
సీవోపీఏ: 170 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 253 పోస్టులు
స్టెనోగ్రాఫర్/ సెక్రెటీరియల్ అసిస్టెంట్: 20 పోస్టులు
ప్లంబర్: 36 పోస్టులు
పెయింటర్: 52 పోస్టులు
వైర్ మెన్: 42 పోస్టులు
ఎలక్ట్రానిక్ మెకానిక్: 12 పోస్టులు
డీజిల్ మెకానిక్: 110 పోస్టులు
మెకానిస్ట్: 5 పోస్టులు
టర్నర్: 7 పోస్టులు
డెంటల్ లేబోరెటరీ టెక్నీషియన్: 1 పోస్టు
హాస్పిటల్ వేస్ట్ మేనేజ్ మెంట్ టెక్నీషియన్: 1పోస్టు
హెల్త్ సెనిటరీ ఇన్ స్పెక్టర్: 1 పోస్టు
స్టెనోగ్రాఫర్: 12 పోస్టులు
కేబుల్ జాయింటర్: 21 పోస్టులు
డిజటర్ ఫోటోగ్రాఫర్: 03 పోస్టులు
డ్రైవర్- కమ్ – మెకానిక్: 3 పోస్టులు
మెకానిక్ టూల్ మెయింటెనెన్స్: 12 పోస్టులు
మేజన్ (బిల్డింగ్ కన్ స్ట్రక్టర్): 36 పోస్టులు
మోతీభాగ్ వర్క్ షాప్ లో..
ఫిట్టర్: 44
వెల్డర్: 9
టర్నర్: 4
ఎలక్ట్రీషియన్: 18 పోస్టులు
సీవోపీఏ: 13 పోస్టులు
విద్యార్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ క్లాస్, సంబంధిత ట్రేడ్ లలో ఐటీఐ పాసై ఉండాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 5
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 4
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
స్టైఫండ్: అప్రెంటీస్ పోస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ అందజేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://secr.indianrailways.gov.in/
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. పోస్టులకు సెలెక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 1007
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 4
ALSO READ: Reliance: ఏపీలో రిలయన్స్ రూ.65,000 కోట్ల పెట్టుబడి..2,50,000 మందికి ఉద్యోగాలు..
ALSO READ: Jobs: రూ.లక్ష జీతంతో ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ పాసైతే చాలు భయ్యా..