Big Stories

Twitter : అందుకు సారీ చెప్పిన ట్విట్టర్ బాస్. ట్విట్టర్ లో మరో కొత్త ఫీచర్

Twitter : మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్. సంస్థలకు సంబంధించిన ఏ ఇతర ట్విట్టర్ ఖాతాలు వాటితో అనుసంధానమై ఉన్నాయో గుర్తించడానికి వీలుగా ఆయా సంస్థలకు అనుమతులు ఇవ్వబోతున్నట్లు ట్విట్టర్ తరపున ఆయన ప్రకటించారు. ఇటీవలే ట్విట్టర్ బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు నిర్ణయాన్ని మస్క్ వాయిదా వేశారు. ఎందుకంటే దీనివల్ల కుప్పలు తెప్పలుగా నకిలీ ఖాతాలు వచ్చి పడుతున్నాయి. దుండగులు ప్రముఖ సంస్థల పేరుతో ఖాతాలు తెరిచి 8 డాలర్లు చెల్లించి బ్లూటిక్ పొందుతున్నారు. ఫలితంగా అమెరికాకు చెందిన ఓ డయబెటిస్ మందుల కంపెనీకి 1.2 లక్షల కోట్లలో నష్టం వచ్చింది. డయాబెటిస్ రోగులకు మందులు ఉచితంగా ఇస్తున్నట్లు ఆ దుండగులు సంస్థ పేరుతో ఓ ట్వీట్ చేశారు. దీనితో సదరు కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎలాన్ మస్క్… తన బ్లూటిక్ నిర్ణయాన్ని వాయిదా వేశారు. వెరిఫికేషన్ లేకుండా బ్లూటిక్ ఇవ్వడం వల్లనే ఈ నష్టం వచ్చిందని గుర్తించారు. ఇక చాలా దేశాల్లో ట్విట్టర్ వేగం తగ్గిపోయింది. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పారు. ఇకముందు ఇలాంటివి జరగబోవని ఆయన హామీ ఇచ్చారు.
ఇక అంతకుముందు ట్విట్టర్ మరింత సజీవంగా అనిపించబోతోందని మస్క్ ట్వీట్ చేశారు. ఇక బ్లూటిక్ వెరిఫికేషన్ కు సంబంధించిన ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఇక ఈ వారాంతంలోగా బ్లూటిక్ వెరిఫికేషన్ ను మళ్లీ తీసుకురానున్నట్లు వివరించారు. ట్విట్టర్ ని చేజిక్కించుకుంటూనే ఎలాన్ మస్క్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. కీలక ఉద్యోగులను తొలగించారు. సంస్థలో 7500 మంది ఉద్యోగులు ఉండగా అందులో సగం మందికి ఉద్వాసన తప్పదన్నారు. ఇప్పటికే చాలా మందిని ఇంటికి పంపించారు. కొందరు టెస్లా ఎంప్లాయిస్ ని కూడా ట్విట్టర్ కు తీసుకొచ్చరు. తీసేసిన వారిలో కొత్త ఫీచర్లు చేసే ఉద్యోగులు ఉండడంతో వాళ్లను తిరిగి రమ్మని బతిమాలారు. మొత్తంగా ఎలాన్ మస్క్ తీరు అందితే జుట్టు అనే చందంగా ఉందంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News