BigTV English

Jio: 5G, 4G ఏదైనా సరే.. టాప్ స్పీడ్ జియోదే..

Jio: 5G, 4G ఏదైనా సరే.. టాప్ స్పీడ్ జియోదే..

4G డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌ విషయంలో వరుసగా రెండో నెలలో కూడా జియో నెంబర్‌ వన్‌ పొజిషన్లో నిలిచింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-ట్రాయ్‌… అక్టోబర్ నెలకు సంబంధించి విడుదల చేసిన 4G స్పీడ్ టెస్ట్ గణాంకాల ప్రకారం… డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో జియోనంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ట్రాయ్‌ డేటా ప్రకారం జియో సగటు 4G డౌన్‌లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps అయితే… అక్టోబర్‌లో అది 20.3 Mbpsకి పెరిగింది. ఇక అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4G డౌన్‌లోడ్ వేగం 15 Mbps అయితే… వొడాఫోన్ ఐడియా డౌన్‌లోడ్ స్పీడ్ 14.5 Mbps. ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియాతో పోలిస్తే జియో 4G సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 5 Mbps ఎక్కువ.


4G అప్‌లోడ్ స్పీడ్ విషయంలోనూ సెప్టెంబర్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన రిలయన్స్ జియో… అక్టోబర్ నెలలో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అక్టోబర్లో 6.2 Mbps సగటు 4G అప్‌లోడ్ స్పీడ్ తో జియో టాప్ లో నిలిచింది. వోడాఫోన్-ఐడియా 4.5 Mbps వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఎయిర్‌టెల్ అప్‌లోడ్ స్పీడ్‌ చాలా బాగా డౌన్ అయింది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4G అప్‌లోడ్ స్పీడ్ 2.7 Mbpsకి పడిపోయింది. ఇది జియో అప్‌లోడ్ స్పీడ్ కంటే సగాని కన్నా తక్కువ.

4G విషయంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మాత్రమే ప్రవేశపెట్టిన 5G నెట్ వర్క్ విషయంలోనూ ఎయిర్‌టెల్ కన్నా జియోనే ఎక్కువ స్పీడుతో పనిచేస్తున్నట్లు కొన్ని సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జియో 5G నెట్ వర్క్ సగటు డౌన్‌లోడ్ స్పీడ్ సెకనుకు 600 Mbps ఉండగా… ఎయిర్‌టెల్ 5G నెట్ వర్క్ సగటు డౌన్‌లోడ్ స్పీడ్ సెకనుకు 516 Mbps మాత్రమేనని… బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ రీసెర్చ్ సంస్థ ఊక్లా తెలిపింది. మరోవైపు… 5G నెట్ వర్క్ దేశమంతా అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశం మొత్తం 5G సేవలు అందిస్తామని జియో ఇప్పటికే ప్రకటిస్తే… 2024 మార్చి నాటికి దాన్ని చేరుకుంటామని ఎయిర్‌టెల్ చెబుతోంది.


Tags

Related News

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Big Stories

×