E-Paper
Advertisement

Football: మారడోనా ‘ఫుట్‌బాల్‌’కు రూ.19.5 కోట్లు

Football: మారడోనా ‘ఫుట్‌బాల్‌’కు రూ.19.5 కోట్లు
Advertisement

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా పేరు చెప్పగానే గుర్తొచ్చేది… హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ గోల్‌. మారడోనా గోల్ కొట్టిన ఆ ఫుట్‌బాల్‌… కోట్ల రూపాయల ధర పలికింది. లండన్‌లో నిర్వహించిన వేలంలో ఆ ఫుట్‌బాల్‌ ఏకంగా రూ.19.5 కోట్లు పలికింది. ఇన్నాళ్లూ ఆ బంతిని ట్యునీషియాకు చెందిన ఆనాటి మ్యాచ్ రిఫరీ అలీ బిన్ నాసర్ తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆయన వేలానికి పెట్టిన ఆ ఫుట్‌బాల్‌ ఇప్పుడు వేలంలో భారీ ధర పలికింది.

1986 సాకర్‌ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మారడోనా రెండు గోల్స్‌ చేశాడు. అందులో ఒక గోల్‌ను చేతితో కొట్టాడు. అయితే ఈ విషయాన్ని మొదట ఎవరూ గుర్తించలేదు. తర్వాత అది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ గోల్‌గా చరిత్రలో నిలబడిపోయింది. అప్పట్లో ఈ గోల్‌ వివాదాస్పదమైనా… మారడోనా అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అంతా ఆ వివాదాన్ని మరిచిపోయారు.

Advertisement

1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా ధరించిన జెర్సీని ఈ ఏడాది ఏప్రిల్‌లో వేలం వేస్తే… అది కూడా భారీ ధర పలికింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై 2-1 గోల్స్ తేడాతో గెలిచి… అర్జెంటీనా సెమీఫైనల్‌ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్టీవ్‌ హాడ్జ్‌కు ఇచ్చాడు. దాన్ని ఏళ్ల పాటు జాగ్రత్తగా దాచుకున్న హాడ్జ్‌… గత ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌ సైట్‌లో వేలానికి పెట్టాడు. ఓ అజ్ఞాత వ్యక్తి ఆ జెర్సీని 9.28 మిలియన్ డాలర్లకు… అంటే… భారత కరెన్సీలో 76 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

21 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో, 91 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించిన మారడోనా… 34 గోల్స్ చేశాడు. ఇక 490 అధికారిక క్లబ్ మ్యాచ్ ల్లో… 259 గోల్స్ సాధించాడు. ఫిఫా నిర్వహించిన ఒక ఇంటర్నెట్ సర్వేలో మారడోనా ఇరవయ్యో శతాబ్దపు గొప్ప ఆటగాడిగా నిలిచాడు. అంతేకాడు… ఫిఫా వరల్డ్ ప్లేయర్ల జాబితాలో మారడోనాది నెంబర్ వన్ ప్లేస్.

Tags

Related News

రాజంపేటలో విచిత్ర దొంగతనం.. గాలిలో తేలుతూ వచ్చి రూ. 35 వేలు దోచేసిన లూటీ మాస్టర్!

నెల్లూరులో కూటమికి షాక్.. జనసేన ఏంటో చూపిస్తాం అంటున్న శివశంకర్!

కిచెన్‌లోని ఈ వస్తువులతో జాగ్రత్త.. మీ ఆరోగ్య సమస్యలకు ఇవే కారణం కావొచ్చు

Karthika Deepam 2 Serial Today Episode October 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని గురించిన నిజం జ్యోత్స్న సూరజ్ కు చెప్తుందా..?            

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

Big Stories

Advertisement
×