BigTV English

A new type of wound dressing: గాయాలకు కొత్త రకమైన డ్రెస్సింగ్.. కనిపించకుండా..

A new type of wound dressing: గాయాలకు కొత్త రకమైన డ్రెస్సింగ్.. కనిపించకుండా..

A new type of wound dressing : గాయం మానిపోవాలి అంటే దానిని ఊరికే కదిలించకూడదు అని వైద్యులు చెప్తుంటారు. అది మానిపోవడం కోసమే దానికి ఒక కట్టును కడతారు. కానీ ఆ కట్టు ఎక్కువ రోజులు అలాగే ఉండడం మంచిది కాదు కాబట్టి దానిని ఎప్పటికప్పుడు మార్చే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రక్రియ అనేది పేషెంట్‌కు మళ్లీ మళ్లీ గాయం వల్ల నొప్పిని కలిగిస్తూనే ఉంటుంది. అయితే టెక్నాలజీ పెరగడంతో డ్రెస్సింగ్ వల్ల కలిగే నొప్పిని పేషెంట్లకు దూరం చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.


గాయాలతో ఉన్న పేషెంట్లకు డ్రెస్సింగ్ అనేది అతి బాధాకరమైన ప్రక్రియ. ఇది వారికి చాలా నొప్పిని కలిగిస్తుంది. అందుకే ఒక స్మార్ట్ డ్రెస్సింగ్ స్టైల్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇప్పటికే చిన్న చిన్న దెబ్బలను పోగొట్టడానికి స్మార్ట్ బ్యాండేజెస్ అనేవాటిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదే సామర్థ్యం ఇప్పుడు డ్రెస్సింగ్‌కు కూడా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. అడ్వాన్స్ పాలిమర్స్‌తో ఈ కొత్త రకమైన డ్రెస్సింగ్‌ను వారు కనిపెట్టారు. ఇది కాలిన గాయాలతో ఉన్న పేషెంట్లకు తొందరగా నయం చేస్తుందని వారు చెప్తున్నారు.

ఈ కొత్త రకం డ్రెస్సింగ్ అనేది కేవలం మెడికల్ రంగంలోనే కాదు.. ఫార్మసీ రంగంలో, కాస్మటిక్ రంగంలో కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా ఒకసారి గాయానికి కట్టు కట్టిన తర్వాత దానిని ఎక్కువశాతం మళ్లీ ఉపయోగించే అవకాశం ఉండదు. అందుకే హైడ్రోజెల్ మెటీరియల్స్ సాయంతో ఈ స్మార్ట్ డ్రెస్సింగ్‌ను రీయూజెబుల్‌గా మార్చాలని వారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు అన్నింటిలో వారు సక్సెస్ అయ్యారు కూడా. ఈ డ్రెస్సింగ్ అనేది శరీరానికి సులువుగా అతికించవచ్చని, సులువుగా తీసేయవచ్చని వారు చెప్తున్నారు.


ఈ డ్రెస్సింగ్‌ను తయారు చేసే ముందు 3డీలో పలువురు పేషెంట్లను క్షుణ్ణంగా స్టడీ చేశారు శాస్త్రవేత్తలు. ఒకవేళ గాయం అనేది చేతివేళ్లకు కానీ, ముక్కుకు కానీ తగిలినప్పుడు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వారు ముందుగా ఇలాంటి ప్రయోగంతో డ్రెస్సింగ్ తయారీని మొదలుపెట్టారు. ముఖ్యంగా కాలిన గాయాలకు వైద్యులను సంప్రదించేవారి కోసమే ఈ డ్రెస్సింగ్ తయారు చేసినట్టుగా శాస్త్రవేత్తలు బయటపెట్టారు. శరీర టెంపరేచర్‌ను బట్టి ఈ డ్రెస్సింగ్ అనేది అనుగుణంగా మారిపోతుందని అన్నారు. త్వరలోనే ఈ డ్రెస్సింగ్ అందరికీ అందుబాటులో వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×